కరోనా కేసుల్లో పోటీ పడుతున్న రాష్ట్రాలు.. మహారాష్ట్రనే నంబర్ వన్
01-07-202001-07-2020 08:05:25 IST
Updated On 01-07-2020 10:05:02 ISTUpdated On 01-07-20202020-07-01T02:35:25.266Z01-07-2020 2020-07-01T02:35:22.765Z - 2020-07-01T04:35:02.877Z - 01-07-2020

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. మంగళవారం కొత్తగా 18,522 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసులు 5,66,840కి ఎగబాకాయి. అదేవిధంగా, ఒక్కరోజులోనే 418 మంది కరోనా బాధితులు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 16,893కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.. అత్యధిక పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలోనే ఉండగా, రెండో స్థానంలోకి ఢిల్లీకి బదులు తమిళనాడు వచ్చి చేరింది. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం..మహారాష్ట్ర 1,69,883 పాజిటివ్ కేసులతో దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఒక్క రోజులోనే 4 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం 86,224 కేసులతో తమిళనాడు రెండో స్థానంలోకి వచ్చేసింది. ఆ తర్వాత ఢిల్లీ(85,161), గుజరాత్(31,938), యూపీ(22,828), బెంగాల్(17,907) తదితర రాష్ట్రాలున్నాయి. కేసులు పెరగడంతో కర్ణాటక హరియాణాను మించింది. దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం 19,459 మందికి కొవిడ్ సోకగా, మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 18,522 మందికి పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దీనిప్రకారం.. క్రితం రోజుతో పోలిస్తే బాధితుల సంఖ్య 937 తగ్గింది. మంగళవారం 418 మంది మృతి చెందారు. మరణాలు సోమవారం కంటే 38 ఎక్కువగా నమోదయ్యాయి. వైర్‌సతో దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక అల్లాడుతున్నాయి. ఒక్క రోజే 3,943 (చెన్నైలో 2,393) వరకు కేసుల నమోదుతో మొత్తం కేసుల్లో తమిళనాడు.. దేశ రాజధాని ఢిల్లీని దాటేసి రెండో స్థానానికి వచ్చింది. అత్యధికంగా 947 మందికి పాజిటివ్ అని తేలడంతో కర్ణాటక.. హరియాణ, ఏపీలను దాటేసింది. దేశంలో కరోనా హాట్‌స్పాట్ మహారాష్ట్రలో మరోసారి 5 వేలపైగా కేసులు వచ్చాయి. వైరస్ తీవ్రత రీత్యా మహారాష్ట్రలోని థానెలో జూలై 2 నుంచి పది రోజుల సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కార్యాలయ సిబ్బందిలో కొందరికి పాజిటివ్ వచ్చింది. రాజధాని ఢిల్లీలో బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక్కడ కొత్తగా 2,084 మంది వైరస్ బారినపడ్డారు. కాగా, దేశంలో వరుసగా ఏడో రోజూ 15 వేలపైగా కేసులు వచ్చాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో.. ఒక్క జూన్ నెల వాటా 66 శాతం అని వివరించింది. కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఇవాళ ఒక్కరోజే.. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఇవాళ కర్ణాటకలో కొత్తగా 947 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రజల్లో కల్లోలం మొదలైంది. కర్ణాటకలో కరోనా సోకిన వారిలో ఇవాళ ఒక్కరోజే 20 మంది మరణించారు. దీంతో కర్ణాటకలో కరోనా మరణాల సంఖ్య 246కి చేరింది. ఇవాళ కర్ణాటకలో కొత్తగా వచ్చిన కరోనా కేసుల్లో.. బెంగళూరు అర్బన్ లోనే 503 కేసులు వెలుగుచూడటం గమనార్హం. బెంగళూరులో లాక్ డౌన్ సడలింపులను మరింత సులభతరం చేయడం కేసులు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కరోనా కేసులు బెంగళూరులో రోజురోజుకు పెరుగుతుండటంతో నగరవాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. కర్ణాటకలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15242కి చేరింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళను మినహాయిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా . ఇటీవల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఏపీ, తెలంగాణల్లో కూడా కరోనా కేసులు రోజుకు 600కు పైగా.. 1000కి దగ్గరగా నమోదవుతుండటం కొంత ఆందోళన కలిగించే విషయం. పతాక స్థాయికి చేరలేదు డబ్ల్యూహెచ్‌వో కోరలు చాస్తున్నట్లుగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ధాటికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు ఇది చేదు వార్తే. కొవిడ్-19 ఇంకా పతాక స్థాయికి చేరాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. కొవిడ్-19పై ప్రభుత్వాలు తగిన విధానాలను అవలంబించకపోతే వైరస్ ఎంతోమందికి సోకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రస్ అదనోమ్ జిబ్రియేసెస్ హెచ్చరించారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
8 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
11 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
14 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
15 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా