newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా కల్లోలం.. ఢిల్లీలో స్కూళ్ళు బంద్... మోడీ భరోసా

13-03-202013-03-2020 08:33:42 IST
Updated On 13-03-2020 09:18:59 ISTUpdated On 13-03-20202020-03-13T03:03:42.166Z13-03-2020 2020-03-13T02:57:37.468Z - 2020-03-13T03:48:59.308Z - 13-03-2020

కరోనా కల్లోలం.. ఢిల్లీలో స్కూళ్ళు బంద్... మోడీ భరోసా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం కలిగిస్తోంది. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా అవగాహన కలిగించే పనిలో నిమగ్నం అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. కరోనాపై ఆందోళన చెందవద్దని, అప్రమత్తతే దానికి సరైన విరుగుడు అని ట్వీట్‌ చేశారు. తగు జాగ్రత్తలు తీసుకుకుని కరోనానను తరిమేద్దామని ఆయన ట్విటర్‌ వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతోపాటు ఆయన దేశవాసులకు పలు కీలక సూచనలు చేశారు.

జనమంతా ఒకేచోట అందరూ గుమికూడవద్దని ప్రధాని సూచించారు. వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గిద్దామని అన్నారు. కొన్నిరోజులపాటు మంత్రులెవరూ విదేశాల్లో పర్యటించబోరని ఆయన తెలిపారు.

కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చర్యల్లో భాగంగానే పర్యాటక వీసాలు రద్దు చేశామని ఆయన స్పష్టం చేశారు.భారత్‌లో తొలి కరోనా మరణం నమోదు కావడం ఆందోళనను మరింత పెంచుతోంది. కర్నాటక కలబుర్గిలో 76 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. కరోనా వైరస్‌తో మృతి చెందినట్టు నిర్ధారించింది ప్రభుత్వం.

కర్నాటక కలబురిగికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనాతో మరణించారని వార్తలు వస్తున్నాయని, అది నిజం కాదని అధికారులు తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ళ వృద్ధుడు కరోనాతో మరణించలేదని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని అన్నారు. సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన సిద్ధిఖీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణించినట్టు వార్తలు రావడంతో కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో జనానికి అర్థం అయింది. 

కరోనా ఎఫెక్ట్‌తో ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఈ నెల 31 వరకు మూసివేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. ఇటు తెలంగాణలో  కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఏ మాత్రం అనుమానం కలిగినా... వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌ను కూడా ఎయిర్ పోర్టులో సిద్ధంగా ఉంచారు. అయితే, తాజాగా రాష్ట్రంలో మరో మూడు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ లక్షణాలున్న ముగ్గురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కాకున్నా... అనుమతి కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. 

ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఆ వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించి వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అయితే, తాజాగా మూడు అనుమానిత కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.

తెలంగాణలోని కాజీపేటలోని ఎన్ఐటీ విద్యార్థికి కరోన లక్షణాలు వున్నట్టు తేలింది. ఇటివల అమెరికా నుండి వచ్చిన విద్యార్థి రోహిణి హాస్పిటల్ లో ప్రథమ చికిత్స పొందుతున్నాడు. ఎంజీఎం హాస్పిటల్ లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఎంజీఎం వైద్యులు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 

ఏపీలోనూ కరోనా భయాందోళనలు కలిగిస్తోంది. నెల్లూరులో కరోనా ఎఫెక్ట్‌తో షాపింగ్ మాల్స్, సినిమా హల్స్‌ మూసివేసే ఆలోచనలో జిల్లా యంత్రాంగం వుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికే నెల్లూరు వాసికి కరోనా సోకినట్టు తేలడంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. కోవిడ్ 19 లక్షణాలతో విజయవాడ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడో విద్యార్థి. జర్మనీ నుంచి ఢిల్లీ, హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకున్న విద్యార్ధికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

అనుమానంతో ఎయిర్ పోర్ట్ లో వైద్యులను కలిసిన బాధితుడిని ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జ్వరం, జలుబు. గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నట్టు ప్రయాణికుడు తెలపడంతో వైద్యులు అప్రమత్తం అయ్యారు. కరోనా వైరస్ లక్షణాలుగా భావించిన వైద్యులు చికిత్సకు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రయాణికుడు వివరాలు గోప్యంగా ఉంచారు అధికారులు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   15 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   18 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle