కరోనా కలకలం..ఫిలిప్పీన్స్లో తెలుగు విద్యార్ధుల అగచాట్లు
18-03-202018-03-2020 07:32:45 IST
2020-03-18T02:02:45.860Z18-03-2020 2020-03-18T02:01:41.937Z - - 17-04-2021

దేశవ్యాప్తంగా కరోనా కలకలం కలిగిస్తోంది. ఇప్పటివరకు143 కేసులు నమోదు కాగా, ఒక్క మహారాష్ట్రలోనే 39 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు ఫిలిప్పీన్స్ దేశంలోని మెడికల్ కాలేజీలలో చదువుతున్న తెలుగు రాష్టాల విద్యార్థులు కరోనా భయంతో మన దేశానికి రావడం కోసం బయలుదేరి మనీలా విమానాశ్రయంలో తీవ్ర మానసిక క్షోభతో అల్లాడిపోతున్నారు. ఫిలిప్పీన్స్ , మలేషియా దేశాలనుండి వచ్చే విమానాలను మన దేశంలోకి అనుమతించక పోవడంతో ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలా నుండి బయలు దేరే విమానాలను హఠాత్తుగా రద్దు చేశారు. దాంతో టిక్కెట్లు కొనుక్కొని విమానాశ్రయం చేరిన 60 మంది తెలుగు రాష్టాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇండియా వెళ్ళే విమానాలు రద్దు అయ్యాయని, విమానాశ్రయం విడిచి వెళ్ళమని అక్కడి అధికారులు ఆదేశిస్తున్నారు. దీంతో దిక్కుతోచక సాయం కోసం ఎదురుచూస్తున్నారు విద్యార్ధులు. ఫిలిప్పీన్స్ దేశంలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బెంబేలెత్తుతున్న తెలుగు విద్యార్థులు విమానాశ్రయంలో ఆకలితో అలమటిస్తున్నారు. .తమను ఎలాగైనా ఇండియా చేర్చమని ఎంబసీ అధికారులను వేడుకుంటున్నారు. విమానాశ్రయం నుండి వాట్సాప్ కాల్ చేసి పాత్రికేయులకు తమ బాధను వివరించారు. వారిలో కందుకూరుకు చెందిన విద్యార్ధిని కూడా ఒకరు ఉన్నారు. విమానాలు రద్దు అయినాయన్న దిగులుతో నిద్ర లేకుండా విమానాశ్రయంలోనే జాగారం చేస్తున్నారు. ఇరాన్లో 250 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు షిరిడీ ఆలయం మూసివేశారు. కరోనా కారణంగా భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయం మూసివేస్తున్నట్టు ప్రకటించింది షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ . తదుపరి ఆదేశాలు వచ్చేవరకు షిరిడీ ఆలయం మూసివేస్తామన్నారు. ఇటు నెల్లూరులో కరోనా వైరస్ పై అవగాహన పెంచుతున్నారు వెంకటగిరి రాజ వంశస్థులు. వెంకటగిరి సంస్థానం మాజీ రాజులైన వారే నేరుగా కరోనా అలర్ట్ పై రంగంలోకి దిగారు..నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక ప్రజా వైద్యశాలలో డాక్టర్ సి కళాధర్ , వెంకటగిరి రాజా సంస్థానాధీశులు డాక్టర్ వి సాయికృష్ణ యాచేంద్ర , డాక్టర్ సర్వజ్ఞ కుమార చంద్ర ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కలిగించే కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అలాగే ముందస్తు జాగ్రత్తగా చేతులు శుభ్రపరుచుకోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ,తుమ్ములు ,జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని వారు తెలియజేశారు . జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో తిరిగే సమయంలో మాస్క్ లు తప్పకుండా ధరించాలని వారు సూచించారు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
11 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
12 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
15 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
19 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
18 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
21 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
17 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
a day ago
ఇంకా