newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా కట్టడి, ఆర్థికం రెండూ కీలకమే.. ప్రధాని దిశానిర్దేశం

28-04-202028-04-2020 11:00:08 IST
Updated On 28-04-2020 11:04:18 ISTUpdated On 28-04-20202020-04-28T05:30:08.025Z28-04-2020 2020-04-28T05:30:06.121Z - 2020-04-28T05:34:18.050Z - 28-04-2020

కరోనా కట్టడి, ఆర్థికం రెండూ కీలకమే.. ప్రధాని దిశానిర్దేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్‌తోనే వేలాది ప్రాణాలు కాపాడగలిగాం

హాట్ స్పాట్స్‌లో లాక్ డౌన్ కొనసాగవచ్చు.. సిద్ధపడాల్సిందే.. 

కరోనా కేసుల సంఖ్య చూసి భయపడొద్దు. ఈ సమస్య దేశం మొత్తానిది..

హాట్‌స్పాట్స్‌లో నిబంధనలను కఠినంగా అమలు చేయాలి.

భవిష్యత్తు జన జీవనంలో మాస్క్‌లు భాగం అవుతాయి.

కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం తప్పదు.

మంత్రం వేస్తే కరోనా మాయం కాదు 

కట్టడి.. ఆర్థిక పునరుజ్జీవం.. రెండంచెల వ్యూహమే పరిష్కారం

కోవిడ్‌–19ను నియంత్రించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికీ ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌ డౌన్‌ నిబంధనల అమలు, ఆంక్షలపై మినహాయింపులు తదితర అంశాలపై వారు చర్చించారు. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న హాట్‌స్పాట్స్‌లో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రధాని సీఎంలకు సూచించారు. లాక్‌డౌన్‌ వల్ల సత్ఫలితాలు వచ్చాయని, వేలాది ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు. మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని ప్రధాని సూచనప్రాయంగా చెప్పారు.

‘కొన్ని దేశాల జనాభా మొత్తం కలిస్తే భారత్‌ జనాభాతో సమానమవుతుంది. మార్చి మొదటివారంలో భారత్‌ సహా చాలా దేశాల్లో కరోనా తీవ్రత దాదాపు ఒకేలా ఉంది. అయితే, సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భారత ప్రభుత్వం విలువైన వేలాది ప్రాణాలను కాపాడగలిగింది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే, కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ఆయన హెచ్చరించారు. అప్రమత్తంగా ఉంటూ, ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను పాటించేలా చూడాల్సి ఉందన్నారు. రెడ్‌ జోన్స్‌ను ఆరెంజ్‌ జోన్స్‌గా, ఆ తరువాత వైరస్‌ రహిత గ్రీన్‌ జోన్స్‌గా మార్చే దిశగా వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. 

‘కేసుల సంఖ్య పెరగడం నేరమేమీ కాదు. కేసుల సంఖ్య పెరుగుతోందని ఒత్తిడి, ఆందోళన చెందకండి. ఈ సమస్య దేశమంతా ఉంది’ అని ప్రధాని సీఎంలతో వ్యాఖ్యానించారు. భౌతిక వ్యాప్తికి సంబంధించి ‘రెండు గజాల దూరం’మంత్రాన్ని అంతా అనుసరించాలన్నారు. వేసవికాలం, వర్షాకాలాల్లో వైరస్‌ వ్యాప్తిని అంచనా వేస్తూ.. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సీఎంలకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తు జన జీవనంలో ఇక మాస్క్‌లు భాగం అవుతాయన్నారు. కరోనాపై పోరులో, ఆర్థిక పునరుజ్జీవనంలో సాధ్యమైనంత వరకు సాంకేతికతను వినియోగించుకోవాలని, సామాన్యుడికి లబ్ధి చేకూర్చే మరిన్ని సంస్కరణలు చేపట్టే దిశగా ఆలోచించాలని ప్రధాని సూచించారు. విద్యా సంస్థల్లోని శాస్త్రవేత్తలు సమన్వయంతో ఈ కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా ప్రయోగాలు చేయాలన్నారు.

కరోనా కట్టడికి తమ రాష్ట్రాల్లో తాము చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. అంతర్జాతీయ సరిహద్దులపై గట్టి నిఘా పెట్టాలని, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను పెంచేందుకు చర్యలు చేపట్టాలని పలువురు ప్రధానికి సూచించారు. కరోనా సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం అందిస్తున్నారని పలువురు ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించారు. కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, పోలీసుల కృషిని నేతలంతా కొనియాడారు. ముఖ్యమంత్రులతో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ప్రధాని కార్యాలయంలోని, ఆరోగ్య శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కరోనా ప్రభావం మరికొన్ని నెలలు ఉంటుందని, మాస్క్‌లు, శానిటైజర్ల వాడకాన్ని కొనసాగించాలని ప్రధాని చెప్పారు.  కరోనా కారణంగా తలెత్తిన సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని ముఖ్యమంత్రులతో వీడియో భేటీ సందర్భంగా సీఎంలకు ప్రధాని మోదీ ఉద్బోధించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా లాక్‌డౌన్‌ నుంచి బయటకు వచ్చే వ్యూహాలను రాష్ట్రాల వారీగా రూపొందించుకోవాలని ప్రధాని సూచించారు.

‘ఇప్పటివరకు రెండు లాక్‌డౌన్‌లను ప్రకటించాం. రెండూ వేర్వేరు తరహా నిబంధనలున్నవి. ఆ దిశగా ఆలోచించాలి. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు’అని సీఎంలతో మోదీ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నుంచి దశలవారీగా బయటకు వచ్చే వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిందిగా ప్రధాని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ వ్యూహాలను స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలే రూపొందించుకోవాలని మోదీ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(ఆంధ్రప్రదేశ్‌), కేసీఆర్‌(తెలంగాణ), కేజ్రీవాల్‌(ఢిల్లీ), ఉద్ధవ్‌ ఠాక్రే(మహారాష్ట్ర), పళనిస్వామి(తమిళనాడు), కన్రాడ్‌ సంగ్మా(మేఘాలయ), యోగి ఆదిత్యనాథ్‌(యూపీ) తదితరులు పాల్గొన్నారు.  

మొత్తంమీద లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రెండో విడత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 3న ముగుస్తుంది. ఒకేసారి దేశవ్యాప్తంగా కాకుండా, కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని, మిగతాచోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలకు చాలావరకు మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రధాని ఇదే అభిప్రాయాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేశారని తెలుస్తోంది.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle