newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కరోనా కట్టడికి బాద్ షా యాక్షన్ ప్లాన్

16-06-202016-06-2020 07:10:23 IST
Updated On 16-06-2020 10:33:42 ISTUpdated On 16-06-20202020-06-16T01:40:23.824Z16-06-2020 2020-06-16T01:40:21.340Z - 2020-06-16T05:03:42.494Z - 16-06-2020

కరోనా కట్టడికి బాద్ షా యాక్షన్ ప్లాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ఉత్తర ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను సరిహద్దుగా కలిగి ఉన్న ఢిల్లీలో విస్తరిస్తున్న కరోనా కట్టడిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు నార్త్‌ బ్లాక్‌లో నిర్వహిస్తారు. బీజేపీతోపాటు ఢిల్లీ అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీలను ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, సీఎస్‌, ఢిల్లీ ఆరోగ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. 

ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌, కరోనా నియంత్రణ నిబంధనలుపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవటం గమనార్హం. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలు ఢిల్లీతో ఉ‍న్న సరిహద్దు మార్గాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ప్రజల రాకపోకల వల్ల తమ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపాయి. ఇక నోయిడా, ఘజియాబాద్‌ నగరాలతో పోల్చితే ఢిల్లీలో ఎక్కువ కరోనా కేసులు నమోదవటంతో ప్రయాణ పరిమితులను కొనసాగిస్తామని ఉత్తరప్రదేశ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. 

షాతో భేటీ ఫలప్రదం.. కేజ్రీవాల్

దేశంలోని అయిదారు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ నానాటికీ విజృంభిస్తూ ఉండడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) అనిల్‌ బైజాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులతో ఆదివారం సమావేశమై కరోనాని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు, మృతదేహాల నిర్వహణ వంటి అంశాల్లో సుప్రీం కూడా మొట్టికాయలు వేయడంతో పరిస్థితుల్ని సమీక్షించి కరోనాను ఎదుర్కోవడానికి ఒక కార్యాచరణను రూపొందించారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఈ సమావేశం ఫలప్రదమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఈ సమావేశంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, రెండు ప్రభుత్వాలు కలిసి కోవిడ్‌ను ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాటానికి సంబంధించి అమిత్‌ షా పలు ట్వీట్లు చేశారు. కరోనా వైరస్‌పై పోరాటంలో కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి సహకరిస్తుందన్నారు.

ఇకపై పరీక్షలు వేగవంతం

దేశ రాజధానిలో కోవిడ్‌ పరీక్షలను ఇక మూడు రెట్లు పెంచనున్నారు. వచ్చే రెండు రోజుల్లో రెట్టింపు పరీక్షలు, ఆరు రోజుల్లో మూడు రెట్లు పరీక్షలు నిర్వహించనున్నారు. కొద్ది రోజుల తర్వాత నగరంలో కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఢిల్లీలో ప్రస్తుతం 241 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. ఈ జోన్లలో ఇంటింటికీ వెళ్లి కేంద్రం సర్వే నిర్వహిస్తుంది. ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయా, పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీస్తుంది. ఈ జోన్లలో నివసించే స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.  

ఢిల్లీలో కోవిడ్‌ రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో కేంద్రం 500 రైల్వే కోచ్‌లను తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చనుంది. ఈ కోచ్‌లలో 8 వేల మందికి చికిత్స అందించవచ్చు. వైరస్‌పై పోరాడడానికి అన్ని రకాల పరికరాలతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా రోగులకు చికిత్స అందించనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 శాతం పడకల్ని కోవిడ్‌ రోగులకు కేటాయించనున్నారు. ఇక్కడ తక్కువ ధరకే వైద్యం అందేలా చర్యలు తీసుకోనున్నారు. కోవిడ్‌ రోగులకు చికిత్సనందించే విధానంపై చిన్న చిన్న ఆస్పత్రుల్లో అవగాహన పెంచడానికి ఎయిమ్స్‌లో సీనియర్‌ వైద్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. వీరంతా అక్కడ వైద్యులకు టెలిఫోన్‌ ద్వారా సూచనలు అందిస్తారు. అంతేకాదు ఢిల్లీలో కోవిడ్‌ సన్నద్ధతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ నగరంలో వైద్య సదుపాయాల్ని పర్యవేక్షిస్తుంది.

కరోనా క్యాపిటల్‌గా ఢిల్లీ

ఢిల్లీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనాకి కూడా కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఒక్క వారంలోనే ఢిల్లీలో కోవిడ్‌ మృతులు 156% పెరిగిపోయాయి. ఇప్పటివరకు 1,271 మంది మరణించారు. కేసుల సంఖ్య 39 వేలకు చేరుకుంది. జూలై 31 నాటికి కేసుల సంఖ్య 5 లక్షలు దాటిపోతుందని, అప్పటికి లక్ష పడకలు కావాలని ఢిల్లీలోని ఆప్‌ సర్కార్‌ అంచనా వేస్తోంది. కోవిడ్‌ రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. నగరం మొత్తమ్మీద ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10 వేల వరకు పడకలు ఉన్నాయి. అవన్నీ దాదాపుగా నిండిపోవడంతో కోవిడ్‌ రోగులు పడరాని పాట్లు పడుతున్నారు.

ఢిల్లీలో కరోనా నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తోంది. సగటున ముగ్గురికి పరీక్షలు చేస్తే ఒక కేసు పాజిటివ్‌గా నమోదు అవుతోందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన ఢిల్లీవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తే మూడింట ఒక వంతు మందికి కోవిడ్‌ నిర్ధారణ అవుతుందని తేలుతోంది. ముంబై, చెన్నై వంటి నగరాలతో పోల్చి చూస్తే ఢిల్లీ అత్యంత తక్కువగా పరీక్షలు నిర్వహిస్తోంది. గత నెలలో రోజుకి 7 వేల పరీక్షలు నిర్వహించే రాజధానిలో హఠాత్తుగా వాటి సంఖ్య గతవారంలో 5 వేలకు తగ్గిపోయింది. దీంతో సుప్రీంకోర్టు అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఢిల్లీలో పరిస్థితి భయంకరంగా, బీభత్సంగా, అత్యంత దయనీయంగా మారిందని వ్యాఖ్యానించిన సుప్రీం వైరస్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్‌ కోచ్‌లను ఏర్పాటుచేసింది. అందులో 54 కోచ్‌ లను ఢిల్లీలోని షకుర్బస్తి రైల్వే స్టేషన్‌ లో ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో 500 కోచ్‌లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో 70 కోచ్‌లు, తెలంగాణలో 60 కోచ్‌లు (సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్‌లలో 20 చొప్పున), ఆంధ్రప్రదేశ్‌ (విజయవాడ)లో 20 కోచ్‌లను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్‌ 240 కోచ్‌లు కావాలని, తెలంగాణ 60 కోచ్‌లు కావాలని గతంలో రైల్వే శాఖను కోరాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle