newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

14-08-202014-08-2020 13:33:58 IST
2020-08-14T08:03:58.213Z14-08-2020 2020-08-14T08:03:35.194Z - - 14-04-2021

కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కేసుల తీవ్రత అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే పాజిటివ్‌ కేసులతోపాటు డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా పెరగడం ఊరటనిచ్చే విషయం. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 64,553 మంది కరోనా బారిన పడ్డారు. ఇంత పెద్ద మొత్తంలో కేసులు రావడం ఇదే ప్రథమం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,61,191కు చేరింది. ఇక దేశంలో నమోదవుతున్న మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

గురువారం ఒక్కరోజే అత్యధికంగా 1007 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మొత్తం 48,040 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య పెరగడంపై వైద్యులు టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే.. రాజస్థాన్‌కి చెందిన బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనపూరియా కరోనావైరస్ ను ఎదుర్కొనేందుకు వింతైన నివారణలు తెలుపుతూ వార్తల్లో నిలిచారు. కరోనావైరస్ ను నివారించేందుకు ఒంటికి బురద రాసుకుని, శంఖం ఊదితే కరోనావైరస్ పోతుందంటూ ఆయన పేర్కొన్నారు. ‘‘బురదలో కూర్చుని శంఖం ఊదుతూ ఉంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి కరోనాతో పోరాడగలదు’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇంతకుముందు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఇలాంటి వ్యాఖ్యలతో విడుదల అయినా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేంద్ర మంత్రి మేఘవాల్ మాట్లాడుతూ.. ‘‘భాభీజీ అప్పడాలు’’ తినండి, వాటిలో రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలు వున్నాయంటూ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌ను జయించేందుకు బాబీజి అప్పడాలు తినాలంటూ ఆయన పేర్కొనడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది.

ఈ సందర్బంగా సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి మేఘవాల్ పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు సాగుతున్న వేళ బీజేపీ నేతల వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   3 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   4 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   7 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   10 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   5 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle