newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా ఎప్పుడెళ్లిపోతుందో తెలీదు.. వాక్సిన్ వచ్చేంత వరకూ జాగ్రత్త... నరేంద్ర మోదీ

27-06-202027-06-2020 07:37:21 IST
Updated On 27-06-2020 11:19:51 ISTUpdated On 27-06-20202020-06-27T02:07:21.524Z27-06-2020 2020-06-27T02:07:19.492Z - 2020-06-27T05:49:51.370Z - 27-06-2020

కరోనా ఎప్పుడెళ్లిపోతుందో తెలీదు.. వాక్సిన్ వచ్చేంత వరకూ జాగ్రత్త...  నరేంద్ర మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వ్యాధినుంచి ఎప్పుడు బయటపడతామో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలీదు కాబట్టి వాక్సిన్ వచ్చేంతవరకు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను ధరించాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. వలస కూలీల నిమిత్తమై రూపొందించిన ‘ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్’ పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. కరోనా వాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలందరూ అత్యంత అప్రమత్తతోనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. వాక్సిన్  వచ్చేంత వరకూ భౌతిక దూరంతో పాటు మాస్కులను కూడా తప్పకుండా ధరించాలని ఆయన సూచించారు. 

‘మనందరి జీవితాల్లో ఎత్తు పల్లాలుంటాయి. మన మన సామాజిక జీవితాల్లో కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటాం. ప్రపంచమంతా ఒకే సమయంలో ఒకే సమస్యను ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేదు. ఈ వ్యాధి నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు. వాక్సిన్ వచ్చేంత వరకూ రెండు గజాల దూరం పాటించాలి. మాస్కులను తప్పకుండా ధరించాలి. కరోనా సోకకుండా చూసుకోవాలి.’’ అంటూ మోదీ సూచించారు.

ప్రధాన మంత్రి రోజ్‌గార్ అభియాన్ యోజన పనిశక్తిపైనే ఆధారపడి ఉందని, ఈ పథకానికి అదే ప్రేరణ అని ప్రకటించారు. యూపీ లాగా ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి పథకాలను తెస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో యూపీ ప్రభుత్వం అత్యంత ధైర్య సాహసాలతో పని చేసిందని, కరోనాతో పోరాడుతోందని మోదీ  ప్రశంసించారు. 

కరోనా వ్యాప్తిని ఎదుర్కోవడంలో స్పెయిన్‌, ఇటలీ, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ కంటే ఉత్తరప్రదేశ్‌ సమర్థంగా పని చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఆ 4 దేశాలు శక్తిమంతమైనవని, వాటి జనాభా 24 కోట్లని చెప్పారు. యూపీ జనాభా కూడా 24 కోట్లని తెలిపారు. వైరస్‌ వల్ల ఆ 4 దేశాల్లో ఇప్పటివరకు 1,30,000 మంది మృతి చెందగా, యూపీలో 600 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారన్నారు. 

కరోనా కట్టడిలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమర్థంగా పనిచేశారని ప్రశంసించారు. తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. యూపీలో యోగి సమర్థంగా చర్యలు తీసుకోకపోతే 85 వేల మరణాలు సంభవించేవని చెప్పారు. ఇతర దేశాలతో గణాంకాలను పోల్చి చూస్తే ఈ విషయాన్ని గుర్తించవచ్చన్నారు. 

వ్యాపార, వాణిజ్యాలను ప్రోత్సహించి ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో శుక్రవారం ‘ఆత్మ నిర్భర్‌ ఉత్తరప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ను మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా యూపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనాకు మందు వచ్చేంతవరకు ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   7 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   10 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle