newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాపై పోరాటానికి కేంద్రం భారీ సాయం

10-04-202010-04-2020 08:41:09 IST
Updated On 10-04-2020 10:02:41 ISTUpdated On 10-04-20202020-04-10T03:11:09.927Z10-04-2020 2020-04-10T03:10:43.073Z - 2020-04-10T04:32:41.395Z - 10-04-2020

కరోనాపై పోరాటానికి కేంద్రం భారీ సాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్-19 దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది.  భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,725కి చేరుకుంది. కరోనానుంచి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినవారు 635 మంది ఉన్నారు. మరోవైపు కరోనాపై పోరాటానికి కేంద్రం భారీగా సాయం అందిస్తోంది. కోవిడ్ 19 వైద్యం కోసం కేంద్రం రూ.15,000 కోట్లు మంజూరు చేస్తున్నట్టు  ప్రకటించింది. 'ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ' కింద ఈ మొత్తాన్ని ప్రకటించింది. ఇందులో రూ.7,774 కోట్లు తక్షణ కోవిడ్-19 స్పందన చర్యల కోసం ఖర్చు చేయనుండగా, తక్కిన మొత్తాన్ని మిషన్ మోడ్ విధానంలో మీడియం టెర్మ్ సపోర్ట్‌గా 1 నుంచి 4 ఏళ్ల పాటు ఖర్చు చేయడానికి ఉద్దేశించింది. 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అత్యవసర స్పందన చర్యలను వేగవంతం చేస్తూ, కోవిడ్-19 తీవ్రతను ఇండియాలో తగ్గుముఖం పట్టేలా చూడటమే ప్యాకేజ్ కీలక ఉద్దేశంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సా సౌకర్యాలు మెరుగుపరచడం, వైరస్ సోకిని వారికి అత్యవసరమైన ఔషధాలను అందుబాటులోకి తేవడం, జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేయడం, భవిష్యత్‌లో వ్యాధులు చెలరేగకుండా తగిన సన్నద్ధతల కోసం ఈ ప్యాకేజీని కేంద్రం ఉద్దేశించింది. లేబొరేటరీలు, నిఘా కార్యకలాపాలను మెరుగుపరచడంతో పాటు బయో-సెక్యూరిటీ సన్నద్ధతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం పర్యవేక్షణలో ఈ చర్యలు కొనసాగుతాయి.

కరోనా వైరస్ పేషెంట్ల చికిత్స, దేశంలో వైద్య సదుపాయాల పటిష్టతను రూ.15,000 కోట్లతో చేపట్టనున్నట్టు మార్చి 24న దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తద్వారా కరోనా పరీక్షా సదుపాయాల సంఖ్య పెంచడం, పీపీఏ, ఐసొలేషన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, ఇతర అత్యవసర సామగ్రి శ్రీఘ్ర గతిన అందుబాటులోకి వస్తాయన్నారు.

మరోవైపు కరోనా మృతుల అంత్యక్రియలకు కూడా మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలకు 5గురికి మించి హాజరు కాకూడదని నిర్దేశించింది. మరోవైపు లాక్ డౌన్ పొడిగింపునకు సంబంధించి కేంద్రం రెండురోజుల్లో కీలక ప్రకటన జారీచేసే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో లాక్ డౌన్ పటిష్టంగా అమలుచేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle