newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనాపై జర్నలిస్టుల పోరాటం అభినందనీయం

03-05-202003-05-2020 19:37:46 IST
Updated On 04-05-2020 06:06:39 ISTUpdated On 04-05-20202020-05-03T14:07:46.559Z03-05-2020 2020-05-03T14:07:43.306Z - 2020-05-04T00:36:39.296Z - 04-05-2020

కరోనాపై జర్నలిస్టుల పోరాటం అభినందనీయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సందేశం ఇచ్చారు. కరోనాపై జర్నలిస్టులు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నిజం, నిష్పాక్షికత, కచ్చితత్వం, జవాబుదారీతనం, న్యాయబద్ధత, నైతికత, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి మూలసూత్రాలకు మీడియా కట్టుబడి ఉండాలని ట్వీట్ చేశారు.

No photo description available.

సమాజంలో జరుగుతున్న సంఘటనలు మాత్రమే ప్రజలకు చూపించాలని.. అందులో సొంత అభిప్రాయాలు జోడించవద్దని అన్నారు. రాజ్యాంగంలోని 19వ అధికరణం ఇస్తున్న భావప్రకటనాస్వేచ్ఛను సద్వినియోగ పరుచుకుంటూ..ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా, ప్రజాస్వామ్యంలో మూలస్తంభంగా పత్రికలు, జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర చిరస్మరణీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఘనంగా జరిగింది. కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలోని తన స్వగృహంలో లో  మీడియా వారిని ఘనంగా సత్కరించారు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి  కరోనా సమయంలో ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి చేరవేయడంలో మీడియా పాత్ర సముచితమయిందన్నారు. 

మీడియా వారికి ఆర్థికపరమైన కుటుంబ పరమైన సమస్యలు ఎన్ని ఉన్నా వారి మొదటి ప్రాముఖ్యత వార్తా సేకరణకే ఇస్తారని, ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే జీవో 2430 ను వెంటనే తొలగించాలని,  మీడియాను ప్రత్యేకంగా చూడాలన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వార్తా సేకరణ చేస్తున్న మీడియా వారికి 50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం తక్షణమే మీడియా వారికి పది వేలు నగదు, రక్షణ కిట్లు ఇవ్వాలన్నారు. పత్రికా స్వేచ్ఛను  అడ్డుకుంటే ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్యవాదులు పార్టీలకు కులాలకు అతీతంగా పత్రికా స్వేచ్ఛకు కృషిచేయాలన్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని,  పత్రికల పైన గౌరవం ఉంచి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఆయన కోరారు. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   31 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle