newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

14-08-202014-08-2020 18:04:30 IST
Updated On 14-08-2020 18:14:09 ISTUpdated On 14-08-20202020-08-14T12:34:30.968Z14-08-2020 2020-08-14T12:34:26.703Z - 2020-08-14T12:44:09.542Z - 14-08-2020

కరోనానుంచి కోలుకున్న అమిత్ షా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రముఖులు కరోనా బారిన పడుతూనే వున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 64వేల 553 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక వెయ్యి 7 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 24లక్షల 61వేల 190కి చేరుకుంది. తాజాగా ఇప్పటివరకు 17లక్షల 51 వేల 555 మంది డిశ్చార్జ్ కాగా, 6లక్షల 61 వేల 595 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనాతో 48వేల 40 మంది మృతి చెందారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇవాళ నిర్వహించిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. ఆ పరమేశ్వరుడి దయ వల్ల కరోనా నుంచి బయటపడ్డానని చెప్పారు. కరోనా నుంచి తాను కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెపుతున్నానని ట్వీట్ చేశారు. 

వైద్యుల సలహా మేరకు మరి కొన్ని రోజులు తాను హోం ఐసొలేషన్ లో ఉంటానని హోంమంత్రి తెలిపారు. తనకు చికిత్స అందించిన మేదాంత ఆసుపత్రి డాక్టర్లకు, ప్యారా మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రెండు వారాల క్రితం కరోనాతో బాధపడుతూ అమిత్ షా ఆస్పత్రిలో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంతా ఆకాంక్షించారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle