కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీ పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
17-09-202017-09-2020 17:08:02 IST
Updated On 17-09-2020 17:07:30 ISTUpdated On 17-09-20202020-09-17T11:38:02.554Z17-09-2020 2020-09-17T11:28:45.159Z - 2020-09-17T11:37:30.747Z - 17-09-2020

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆత్మహత్య కేసు ప్రస్తుతం డ్రగ్స్ కేసుగా మారి దేశంలోని అన్ని సినీ పరిశ్రమలను కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ ప్రియురాలు రియాతో పాటు చాలా మందిని అరెస్ట్ చేసింది. ఇప్పటికే సుశాంత్ మరణంతో బాలీవుడ్ మాఫియా అంటూ ఇండస్ట్రీలోని చాలా మందిపై ఆరోపణలు వచ్చాయి. అందులో ముఖ్యంగా దర్శక నిర్మాత కరణ్ సింగ్ ఒకరు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా బాలీవుడ్ సెలబ్రిటీల మాదకద్రవ్యాల వినియోగంపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్సిబి ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన ఓ పార్టీ వీడియో కొంతకాలం క్రితం బయటకు వచ్చింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అదే వీడియోని చూపిస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ఫిర్యాదు చేసారు మంజిందర్. ఏడాది కాలంగా ఆ `డ్రగ్ పార్టీ` వీడియో వైరల్ అవుతూనే ఉందని, ఆ పార్టీలో ఉన్న సెలబ్రిటీలపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఎన్సీబీకి లేఖ రాశారు. ఆ లేఖలో "నేను సిర్సా.. ముంబైలోని కరణ్ నివాసంలో డ్రగ్ పార్టీని నిర్వహించారు. ఆయనపైనా పార్టీలో పాల్గొన్న ఇతరులపైనా దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదును సమర్పిస్తున్నాను. డిల్లీలోని నార్కోటిక్స్ బ్యూరో బి.ఎస్.ఎఫ్ హెడ్ రాకేశ్ అస్థానా ఆ పార్టీ వీడియోను తప్పక దర్యాప్తు చేయాలి" అంటూ రాశారు. ఆ లేఖకు సంబంధించిన స్క్రీన్షాట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ వీడియోలో దీపికా పదుకొనే, విక్కీ కౌషల్, మలైకా అరోరా, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్.. ఇలా చాల మంది సెలెబ్రిటీలు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు. కరణ్ ఇంటి ప్రాంగణాన్ని నేరాల కోసం ఉపయోగించారని వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలోనే ఆ వీడియో వైరల్ అయినప్పుడు కరణ్ జోహార్ మాట్లాడుతూ.. తన పార్టీలో ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని, పరిశ్రమ సభ్యులు, స్నేహితులు కష్టపడి పనిచేసిన వారం తర్వాత మంచి సమయాన్ని ఆస్వాదించామని, నా తల్లి గారు ఈ వీడియోకు 5 నిమిషాల ముందు మాతోనే ఉన్నారని, ఇది ఒక రకమైన కుటుంబం, సామాజిక సమావేశం అనుకోవాలి. ఇక్కడ స్నేహితులు కూర్చుని మంచి సమయం గడిపారు. మేం సంగీతం వింటున్నాము, మంచి ఆహారాన్ని తిన్నాం, మంచి సంభాషణలు జరుపుకున్నాం. ఇంకేమీ జరగడం లేదు అక్కడ, నేను ఆ వీడియోను చాలా శ్రద్ధగా తీసుకున్నది. ఏదైనా తప్పు జరుగుతుంటే నేను ఆ వీడియోను బయట పెడతానా? నేను తెలివితక్కువవాడిని కాదు కదా అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి గతంలోనే ఆ వీడియో గురించి అలా చెప్పిన కరణ్ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వీడియో మళ్ళీ వైరల్ అవుతుండటంతో దాని మీద మాట్లాడతారో లేదో చూడాలి. మొదటి నుంచి సుశాంత్ మరణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కరణ్ జోహార్ ని ఎన్సీబీ విచారిస్తుందా లేదా చూడాలి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా