కమల్ నాథ్ సర్కార్‌కు గండం.. బీజేపీ వ్యూహం
10-03-202010-03-2020 09:33:11 IST
2020-03-10T04:03:11.043Z10-03-2020 2020-03-10T04:01:57.699Z - - 22-04-2021

మధ్యప్రదేశ్ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుకి రెడీ అయ్యారు. 20 మంది మంత్రులు రాజీనామా చేయడంతో సంక్షోభాన్ని అనుకూలంగా మలుచుకొనే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వీరిలో ఆరుగురు మంత్రులు ఉండడం, వారిని బెంగళూరుకు తరలించడం ఉత్కంఠ రేపుతోంది. తాజా పరిణామాలతో ఖంగుతిన్న సీఎం కమల్‌నాథ్ అత్యవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దినదినగండంగా కొనసాగుతుండగా.. తాజా పరిణామాలతో కమల్‌నాథ్‌కు పదవీ గండం పొంచి ఉందని చెబుతున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్ళడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బెంగళూరుకి వెళ్ళినవారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉండడం. వీరంతా కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులే. తిరుగుబాటు వర్గంలో వైద్యశాఖ మంత్రి తులసి సిలావత్, కార్మికశాఖ మంత్రి మహేంద్రసింగ్ సిసోడియా, రవాణాశాఖ మంత్రి గోవింద్‌సింగ్ రాజ్‌పుత్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ఇమార్తిదేవి, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్ తోమర్, పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రభు చౌదరి ఉన్నట్టు తెలిసింది. వారందరి ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయంటున్నారు. తమవద్ద 20 మంది ఎమ్మెల్యేలున్నారని సింధియా వర్గం చెప్తుండగా, కాంగ్రెస్ మాత్రం తొమ్మిది మందేనని వాదిస్తోంది. ఇదిలా ఉంటే.. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సోమవారం ఉదయం ఢిల్లీలో సోనియాగాంధీతో భేటీ అయ్యారు. అయితే సింధియా వర్గం ఎదురుతిరుగడంతో ఆగమేఘాల మీద భోపాల్‌కు చేరుకోవాల్సి వచ్చింది. సంక్షోభం నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు కమల్ నాథ్. మంత్రివర్గ సహచరులతో ఆయన రెండు గంటలపాటు సమాలోచనలు జరిపారు. క్యాబినెట్ సమావేశానికి హాజరైన 20 మంది మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించారని మంత్రి ఉమంగ్ సెంగార్ తెలిపారు. పరిణామాలు ఇలా వుంటే.. జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలోని తన నివాసంలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ, అమిత్‌షాతో సమావేశం అవుతారని బీజేపీ వర్గాలు చెప్పాయి. అయితే భేటీ జరుగలేదని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం సింధియాను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. అధికార పార్టీలో మొదలైన సంక్షోభాన్ని బీజేపీ వాడుకోవాలని చూస్తోంది. బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులను ఆయనకు వివరించారు. మధ్యప్రదేశ్‌లో 2018 డిసెంబర్లో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం పదవి కోసం కమల్‌నాథ్, సింధియా పోటీపడ్డారు. అయితే సింధియాకు 23 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండటంతో సీఎం కుర్చీ దక్కలేదు. అప్పటినుంచీ కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కొంతకాలంగా సరైన సంబంధాలు లేవు. అప్పటి నుంచి సింధియా అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతోపాటు ఆయనకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఆయన మద్దతుదారులను ఎదుగనీయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింధియా తరుచూ తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. జ్యోతిరాదిత్య సింథియాకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తోంది బీజేపీ. అందులో భాగంగా సింధియాను రాజ్యసభకు పంపడం, కేంద్ర మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించడం ఆ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా