newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కమల్ నాథ్ వర్సెస్ సింధియా.. అధికారంలోకి వచ్చినా తప్పని వర్గపోరు

20-02-202020-02-2020 09:38:43 IST
2020-02-20T04:08:43.589Z20-02-2020 2020-02-20T04:08:08.400Z - - 14-04-2021

కమల్ నాథ్ వర్సెస్ సింధియా.. అధికారంలోకి వచ్చినా తప్పని వర్గపోరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అధికారంలోకి లేకపోతే నేతల భవిష్యత్తుమీద బెంగ వుంటుంది. అదే అధికారం చేతిలో వుంటే ధీమా వుండాలి. కానీ కాంగ్రెస్ నేతల మధ్య అలాంటిది మచ్చుకి కూడా కనిపించడంలేదు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం..సేమ్ అలాగే ఉంది మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి. ఇద్దరు సీనియర్ నేతలు ఆధిపత్య పోరు తీవ్రమవుతోంది. 

కాంగ్రెస్ కు వరస ఓటములు ఎదురవుతున్నా అధికారంలో ఉన్నామని విర్రవీగడం తప్పించి ప్రజామోదం పొందే ప్రయత్నాలు చేయడం లేదు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తే ఎవరికైనా చెప్పకనే తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో అధికారంలోకి కాంగ్రెస్ రావడం నిజంగా కలే.మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ నేతల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినా... నిలబెట్టుకొనే పరిస్థితులు కనిపించడం లేదు.  ఇద్దరు సీనియర్ నేతల మధ్య వివాదాలు అధిష్టానికి తలనోప్పిగా మారింది.భారతీయ జనతా పార్టీ పదిహేనేళ్లుగా పాలనలో ఉండటమే కాంగ్రెస్ కు కలిసి వచ్చిందని చెబుతున్నారు. 

సీనియర్ నేతలున్నా వారికి రాష్ట్రం మొత్తం కరిష్మా లేదు. దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్ వంటి వారు పార్టీ సింబల్ ఆధారంగానే ఇన్నాళ్లూ రాజకీయాలను లాగించేస్తున్నారు. అంతే తప్ప వారికంటూ ప్రత్యేకించి సొంత ముద్రలేదన్నది వాస్తవం. మొత్తం మీద మధ్యప్రదేశ్ ఎన్నికల్లో చచ్చీ చెడీ గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించడం లేదన్నది సుస్పష‌్టం.

కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి కమల్ నాధ్, యువనేత జ్యోతిరాదిత్య సింధియాల మధ్య అంతర్గత యుద్ధం ప్రారంభమయింది. తనకు దక్కాల్సిన సీటును కమల్ నాధ్ చేజిక్కించుకున్నాడని ఎప్పటి నుంచో సింధియా కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతటితో ఆగకుండా వరసగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు తానే విపక్షంగా మారి రోడ్డుపైకి వచ్చి ఆందోళనలకు దిగుతానని హెచ్చరిస్తున్నారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పతనమయ్యేందుకు సంకేతంగానే చూడాల్సి ఉంటుంది.

మధ్యప్రదేశ్‌లో రైతు రుణ మాఫీ, ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్‌ వంటి ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చకుంటే ఆందోళనలు చేపడతామంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా చేసిన హెచ్చరికపై రాష్ట్ర సీఎం కమల్‌నాథ్‌ స్పందించారు. సింధియా  తనకు నచ్చినట్లు చేయొచ్చని  ముందుగా ఆందోళనలకు దిగనివ్వండి చుద్దామంటున్నారు. 

ఎన్నికల మేనిఫెస్టో అంటే ఐదేళ్లకు వర్తించేదే తప్ప ఐదు నెలలకు కాదంటూ వ్యాఖ్యానించారు. పంటనష్టం సర్వే, రైతు రుణమాఫీ విషయంలో అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తరచూ సింధియా తప్పుపడుతున్నారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని పార్టీ చీఫ్‌ సోనియా నియమిస్తారని ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ శనివారం గ్వాలియర్‌లో చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు రేసులో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు.

ఇక సీనియర్ నేత, ముఖ్యమంత్రి కమల్ నాధ్ కూడా ఏమాత్రం తగ్గడంలేదు. దిగ్విజయ్ సింగ్ తో జతకట్టి సింధియాను పార్టీ, ప్రభుత్వ పరంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవి విషయంలోనూ ఇదే తంతు. మొత్తం మీద మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో ముసలం మొదలయిందనే చెప్పాలి. ఇప్పటికే అధిష్టానం పలుమార్లు వార్నింగ్ లు ఇచ్చినా ఎవరూ సర్దుకుని వెళ్లేందుకు సుముఖత చూపడంలేదు. దీంతో పెద్ద రాష్ట్రం హస్తం నుంచి చేజారిపోయే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   10 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle