newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కమలానికి చావుదెబ్బ.. కాంగ్రెస్ కూటమికి బంపర్ ఆఫర్

24-12-201924-12-2019 09:10:36 IST
Updated On 24-12-2019 11:48:17 ISTUpdated On 24-12-20192019-12-24T03:40:36.221Z24-12-2019 2019-12-24T03:40:28.890Z - 2019-12-24T06:18:17.566Z - 24-12-2019

కమలానికి చావుదెబ్బ.. కాంగ్రెస్ కూటమికి బంపర్ ఆఫర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మోడీ-షా వ్యూహాలు ఫలించలేదు. కమల వికాసం జార్ఖండ్ లో సాధ్యం కాలేదు. జార్ఖండ్ ఎన్నికల్లో మరోమారు విజయం సాధించాలని భావించిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. ప్రతిష్టాత్మకంగా జరిగిన జార్ఖండ్‌ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది.

ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోయింది. మొత్తం 81 స్థానాలకు  జరిగిన ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ 41 సీట్లు. కానీ జార్ఖండ్ ముక్తీ మోర్చా-కాంగ్రెస్ కూటమి అనూహ్యంగా  47 సీట్లు సాధించింది. అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 25 స్థానాలకే పరిమితం కావడం విశేషం. 

ఈ ఎన్నికల్లో జేవీఎం 3, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 4స్థానాలకు పరిమితమయ్యారు. ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ ఓటమి పాలయ్యారు. 24 ఏళ్ళ రాజకీయ జీవితంలో రఘుబర్ దాస్ ఓటమి మొదటిసారి. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి హేమంత్‌ సొరెన్‌ పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించారు.

రఘుబర్‌ దాస్‌ కేబినెట్‌లో ఉన్న ఆరుగురు మంత్రులతో పాటు స్పీకర్‌ కూడా ఓటమిపాలయ్యారు.  ప్రతిష్టాత్మక జంషెడ్‌పూర్‌(ఈస్ట్‌) స్థానం నుంచి సీఎం రఘుబర్‌ దాస్‌ పోటీ చేశారు. ఆయనపై  బీజేపీ రెబెల్‌ అభ్యర్థి సరయు రాయ్‌ గెలుపొందారు. జంషెడ్‌పూర్‌(వెస్ట్‌) నుంచి టికెట్‌ నిరాకరించడంతో సరయు రాయ్‌ ఇండిపెండెంట్‌గా జంషెడ్‌పూర్‌(ఈస్ట్‌) నుంచి బరిలో దిగారు. అసెంబ్లీ స్పీకర్‌ దినేశ్‌ ఓరాన్ కూడా ఓడిపోయారు. 

మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్‌లో ఈ సారి బీజేపీ ఒంటరిగా పోటీచేసింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఎన్నికల వరకు ఏజేఎస్‌యూతో కలిసి పోటీ చేసిన కమలనాథులు.. ఈసారి ఆ పార్టీతో సీట్ల పంపకాల విషయంలో పొరపొచ్చాలు రావడంతో వేర్వేరుగానే బరిలో దిగారు.

దీంతో అధికారం కోల్పోవాల్సి వచ్చింది.  ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి, బీజేపీ నేత రఘుబర్‌ దాస్‌ రాజీనామా చేశారు. ఫలితాల సమయంలో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసినా.. చివరికి పరాభవం తప్పలేదు. రాజీనామా లేఖను గవర్నర్‌ ద్రౌపది ముర్ముకి అందించారు రఘుబర్ దాస్. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి, కూటమి సీఎం అభ్యర్థి హేమంత్‌ సోరెన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.జార్ఖండ్‌ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి విజయంపై సోనియా గాంధీ స్పందించారు.

Image

దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో కూటమి విజయం అత్యవసరమని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌కు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రం మరింతగా అభివృద్ది పథం వైపు పయనించాలని సోనియా ఆకాంక్షించారు. 

2014 ఎన్నికల్లో జేఎఎంకి 19 సీట్లు రాగా ప్రస్తుతం 30 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు స్థానాలు సాధించగా.. ఇప్పుడు 16 స్థానాలను కైవసం చేసుకుంది.  2014 ఎన్నికల్లో బీజేపీ 37 స్థానాలు సాధించగా.. ఈ సారి 25 సీట్లకే పరిమితం అయింది. ఏజేఎస్ యూ గతంలో 5సీట్లనుంచి ప్రస్తుతం 2 సీట్లు సాధించింది. ఇండిపెండెంట్లు అనూహ్యంగా ఈసారి 2 సీట్లు సాధించం విశేషం. లోక్ సభ ఎన్నికల్లో మంచి ఊపు మీదున్న బీజేపీకి ఈ విజయం షాకిచ్చిందనే చెప్పాలి. 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle