newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కంగనా నోరు జాగ్రత్త.. మహా సీఎం హెచ్చరిక..!

14-09-202014-09-2020 08:05:12 IST
2020-09-14T02:35:12.952Z14-09-2020 2020-09-14T02:35:09.101Z - - 11-04-2021

కంగనా నోరు జాగ్రత్త.. మహా సీఎం హెచ్చరిక..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాము మౌనంగా ఉన్నామంటే దానికి అర్థం తమకు ఏమీ చేతకావట్లేదని అర్థం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బాలీవుడ్ క్వీన్ కంగనాను పరోక్షంగా హెచ్చరించారు. రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌తో పాటు తమను విమర్శిస్తున్న రాజకీయ పార్టీలతోనూ పోరాటం చేస్తున్నామని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి ఎన్నో అవాంతరాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నా అని తాజా వివాదాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఠాక్రే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

మహారాష్ట్ర సర్కార్‌, బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ మధ్య రాజుకున్న రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. ఆదివారం సాయంత్రం కంగనా రనౌత్‌ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో భేటీ అయన  నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మీడియా సమావేశం నిర్వహించారు. తాము మౌనంగా ఉన్నామంటే దానికి అర్థం తమకు ఏమీ చేతకావట్లేదని అర్థం కాదని, కంగనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఠాక్రే హెచ్చరించారు. రాజకీయ తుఫానులను ఎన్నింటినో తాము ఎదుర్కొన్నామని, కంగనా బుడ్డ బెదిరింపులకు తాము తలవంచమని ఠాక్రే సవాలు విసిరారు.

ముంబై పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా తయారైందని మహారాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేసిస విషయం తెలిసిందే. అనంతరం కొన్ని గంటల్లోనే ముంబైలోని కంగనా ఆఫీస్‌ ఆక్రమ కట్టడమంటూ బీఎంసీ అధికారులు దాన్ని కూల్చి వేసేందుకు సిద్ధమయ్యారు. అయినా కంగనా రనౌత్‌ ఏమాత్రం భయపడకుండా శివసేన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ వైఖరిని ఎండగట్టారు.

ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించిన కంగనా తన కార్యాలయాన్ని బీఎంసీ కూల్చడంపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీను ప్రత్యేకంగా కంగనా కలిశారు కూడా.. అంతకు ముందే బాంద్రాలోని కంగనా ఆఫీసును బీఎంసీ అధికారులు కూలగొట్టడంపై గవర్నర్‌ అంసతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా మహారాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని వివరణ కూడా అడిగారు‌. 

ముంబై జాతీయ సమగ్రతకు ప్రతీక అని అందరికి తెలిసినప్పటికీ వివాద మాఫీయా ఎప్పుడూ ముంబైని మాత్రమే విమర్శిస్తుంది తప్ప ఇతర రాష్ట్రాల రాజధానులను కాదంటూ పార్టీ అధికార వాణి సామ్నా పత్రికలో శివసేన పేర్కొంది.  ఛత్రపతి షాహు మహారాజ్‌, మహాత్మా జ్యోతిరావ్‌ పులే, భీమరావు అంబేద్కర్‌ జన్మించిన మహరాష్ట్ర  ఒక దేశమని; మహారాష్ట్ర మరణిస్తే, దేశం నశించిపోతుందని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి పాండురంగ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా శివసేన గుర్తు చేసింది.

ముంబై పాకిస్తాన్‌ అక్రమిత కశ్మీర్(పీఓకే)’‌ కాదని, అలాంటి వ్యాఖ్యలు చేసిన వారు త్వరలోనే దాని ఫలితాన్ని ఆనందిస్తారని సామ్నా వ్యంగ్య వ్యాఖ్యలు చేయడమే కాకుండా కంగనాకు శుభాకాంక్షలు(ముబారక్‌ హో) అంటూ వ్యాఖ్యానించింది. అదే విధంగా దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై ఈ మధ్య వివాదాలకు అలవాటు పడిందని శివసేన పేర్కొంది. ఏ విధంగా అంటే.. మహాభారతంలో కౌరవులు ద్రౌపతి వస్ర్తాభరణ చేస్తుండగా పాండవులంతా తలవంచుకుంటారు... ప్రస్తుతం శివసేన కూడా అదే చేస్తుంది అని తెలిపింది.

పార్టీ అధికార పత్రిక సామ్నా ద్వారా పరోక్షంగా కంగనాపై శివసేన మాటల యుద్దానికి దిగడం విశేషం.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle