కంగనాను హీరోను చేయవద్దు.. పవార్.. ధిక్కరించిన ఠాక్రే
11-09-202011-09-2020 07:44:23 IST
2020-09-11T02:14:23.488Z11-09-2020 2020-09-11T02:14:20.779Z - - 17-04-2021

బాలీవుడ్‌పై మాఫియా వలపై ఇంతవరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కి మధ్య కొనసాగిన ఘర్షణ అంతిమంగా ఆ రాష్ట్రంలోని అధికార కూటమిలోనే చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. కరోనా విజృంభణ, సరిహద్దుల్లో చైనా దురాక్రమణను మించి కంగనా, శివసేన వ్యవహారంపై మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో ప్రారంభమైన ఈ ప్రకంపనలు ఏకంగా కంగనా ముంబైలో నిర్మించుకున్న కార్యాలయాన్ని కూల్చేవరకు తీసుకెళ్లాయి. ఈ తీవ్రచర్యతో రాష్ట్రప్రభుత్వం అటు హైకోర్టులోనూ, ఇటు ప్రజల్లోనూ పరువు పోగొట్టుకున్నంత పనయింది. అదే సమయంలో మరాఠా యోధుడు శరద్ పవార్ తన కూటమి ప్రభుత్వాన్ని మందలించారని, కానీ ఠాక్రే ఆయన మాటలను పెడ చెవిన పెట్టారని వార్తలు గుప్పుమన్నాయి. మహా ప్రభుత్వం కంగనా ముంబైలో అడుగుపెట్టే సమయానికి ఊహించని షాకే ఇచ్చింది. ఆమె నిర్మించుకున్న కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేతగా సిద్ధమైంది. అయితే కంగనా కార్యాలయం కూల్చివేతపై ప్రభుత్వంలో ముందే పెద్ద ఎత్తునే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం రోజున అక్రమ కట్టడాన్ని కూల్చివేయగా.. అంతకంటే ముందే అంటే మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన ఎంపీ సంజయ్ రైత్ మధ్య కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. కంగనా నిర్మాణాన్ని తొలగించి వివాదాన్ని మరింత పెద్దదిగా చేయవద్దని శరద్ పవార్.. సీఎం ఠాక్రేతో వారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంగనా వ్యవహారాన్ని వదిలేయాలని, చట్ట పరంగా ఏమైనా చర్యలు ఉంటే అది స్వతంత్ర హోదా కలిగిన బీఎంసీ అధికారులే చూసుకుంటారని చెప్పిన్నట్లు తెలిసింది. అయితే పవార్ వాదనతో ఏకీభవించని ఠాక్రే కంగనాను వదిలే ప్రసక్తే లేదని, అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని తేల్చి చెప్పినట్లు ముంబై వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీనిలో ప్రభుత్వం తప్పిందం ఏదైనా ఉంటే ప్రతిపక్ష బీజేపీకి మరింత అవకాశం దొరుకుతుందనీ కూడా పవార్ చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కంగనా-శివసేన ఎపిసోడ్లో ప్రభుత్వ తీరుపై పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శివసేన గతంలో ఎన్నోసార్లు దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తూ ఇంత అసహనం, ఇంత తొందరపాటు ప్రదర్శించడం ఆ పార్టీకే కాదు... కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కూడా రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకుంటోదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇదిలావుండగా కంగనా కార్యాలయం కూల్చివేతపై మహారాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈనెల 22 వరకు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని బీఏంసీ అధికారులను ఆశ్రయించింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354/ఎ కింద, బీఎంసీ సభ్యులు కంగనా కార్యాలయం కూల్చివేత పనులను షురూ చేశారు. కూల్చివేత పనులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. అనంతరం గురువారం మధ్యాహ్నం తన కార్యాలయన్ని కంగనా పరిశీలించారు. మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘఢీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే బీజేపీ కంగనాకు మద్దతుగా నిలుస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
29 minutes ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
22 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
2 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
21 hours ago
ఇంకా