ఓడిపోయాం. ఒప్పుకుంటున్నాం.. కర్నాటక్ బైపోల్స్‌పై శివకుమార్
09-12-201909-12-2019 15:13:39 IST
Updated On 11-12-2019 10:12:43 ISTUpdated On 11-12-20192019-12-09T09:43:39.191Z09-12-2019 2019-12-09T09:43:35.868Z - 2019-12-11T04:42:43.570Z - 11-12-2019

కర్ణాటకలో ఇటీవల జరిగిన 15 అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అధికార బీజేపీ అత్యధికంగా 12 స్థానాలను గెలుచుకుంటోందని తెలుస్తోంది. విపక్ష జేడీఎస్, కాంగ్రెస్ మిగిలిన స్థానాల్లో స్వల్ప ఆధిక్యం సాధించాయి. ముందుగా ఊహించినట్లుగానే బీజేపీకి అనుకూలంగా తీర్పు వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన అన్ని దశల్లోనూ బీజేపీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం బీజేపీ ఒక చోట విజయం సాధించగా, 11 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్ అన్నిచోట్ల వెనుకంజలో ఉండడం గమనార్హం. ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మరింత నిరాశను మిగిల్చేలా ఉన్నాయి. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం ఇక శాశ్వతంగా సమసిపోయినట్లే అని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప సర్కార్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్‌ను నింపేలా ఉన్నాయి. యడ్డీ సర్కార్‌ను నిలబడాలంటే 15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాల్లో అధికార పార్టీ సభ్యులు విజయం సాధిస్తే చాలు. కర్నాటకలో తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ స్వాగతించారు. ప్రజా తీర్పును గౌరవించి ఓటమిని అంగీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఫిరాయింపుదారులను అంగీరించారని, అందుకే వారిని గెలిపించారని తెలిపారు. ఈ ఫలితాలతో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఉప ఎన్నికల్లో కనీసం ఆరు స్థానాల్లో గెలుపొందినా ఆ సంఖ్య 111కి చేరుతుంది. దీంతో ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియూరప్ప సీటుకు వచ్చిన ఢోకా ఏం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊరటను కలిగిస్తున్నాయి. కన్నడలో ఇక తమకు తిరుగులేదని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. కన్నడ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఇక కాలం చెల్లినట్టే అని ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా యడియూరప్ప సర్కార్‌ను మరోసారి కూల్చాలని కలలుకన్న జేడీఎస్, కాంగ్రెస్‌లకు ఉప ఎన్నికల్లో చేదు పలితాలే ఎదురయ్యేలా ఉన్నాయి. అన్ని స్థానాల్లో వేరువేరుగా పోటీకి దిగిన విపక్షాలు అధికార బీజేపీకి కనీసం పోటీ కూడా ఇవ్వనట్లు తెలుస్తోంది. కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విపక్షాలు ముందంజలో ఉన్నాయి. ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మరింత నిరాశను మిగిల్చేలా ఉన్నాయి. 15 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఎమ్మెల్యేలుగా గెలిచిన 12 మంది సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని కర్ణాటక మంత్రి అశోక్ అన్నారు. బీజేపీ కచ్చితంగా 12 స్థానాల్లో గెలుస్తుంది. వారందరికి సీఎం యడియురప్ప సముచిత స్థానం కల్పిస్తారా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా