ఓకే.. ఓకే.. అంటూనే ఫిట్టింగ్ పెట్టారు..!
17-11-201917-11-2019 08:36:29 IST
2019-11-17T03:06:29.883Z17-11-2019 2019-11-17T03:06:15.219Z - - 12-04-2021

మహారాష్ట్రలో పొలిటికల్ గేమ్ ఒక కొలిక్కి వస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేయనున్నారు. మూడు పార్టీల మధ్య పదవుల పంపకం కూడా పూర్తైంది. అయితే, శివసేనకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి అంగీకరించిన కాంగ్రెస్, ఎన్సీపీ ఓ షరతు పెట్టాయి. థాక్రే కుటుంబం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటోంది. అయినా పార్టీ స్థాపించిన నాటి నుంచి మహా రాజకీయాల్లో థాక్రే కుటుంబానికి కీలక పాత్ర. అయితే, శివసైనికుడిని మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని చేస్తానని తన తండ్రి, శివసే వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకు ఉద్దవ్ థాక్రే మాటిచ్చారు. అందుకే మొదటిసారిగా తన కుమారుడు ఆధిత్య థాక్రేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించారు. శివసేనతో కలిసి ముఖ్యమంత్రి పదవీకాలాన్ని పంచుకునేందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలను సంప్రదించింది. రెండు పార్టీలూ శివసేనతో కలవడానికి సిద్ధంగా ఉండటంతో ఆధిత్య థాక్రే ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ కాంగ్రెస్, ఎన్సీపీ మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. నిండా 30 ఏళ్లు కూడా లేని ఆధిత్యను ముఖ్యమంత్రిని చేస్తే తమ పార్టీల్లోని సీనియర్లతో సమస్యలు వస్తాయని, మళ్లీ కర్ణాటక సీన్ రిపీట్ అయ్యే ప్రమాదం ఉందనేది ఆ పార్టీల భావన. ఆధిత్య థాక్రే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గత కొన్ని రోజులుగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్నా, ప్రజల్లోకి వెళుతున్నా పాలనాపరంగా ఏ మాత్రం అనుభవం లేదు. దీంతో ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే సమస్యలు వస్తాయని కాంగ్రెస్, ఎన్సీపీ భావిస్తున్నాయి. పైగా కాంగ్రెస్లో ఇప్పటికే ముఖ్యమంత్రులుగా పని చేసిన నేతలు, ఎన్సీపీలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన శరద్ పవార్ అల్లుడు అజీత్ పవార్ సీనియర్ నేతలుగా ఉన్నారు. ఆధిత్య థాక్రే వంటి జూనియర్ ముఖ్యమంత్రిగా ఉంటే వీరంతా రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయని, అదే జరిగితే కర్ణాటకలో జరిగినట్లు ప్రభుత్వం మధ్యలోనే కూలిపోయే అవకాశం ఉందని భయపడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేన తీసుకున్నా ఆధిత్య ముఖ్యమంత్రి అవ్వొద్దని చెబుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సీఎం అయితే తమకు సమస్య లేదని కాంగ్రెస్, ఎన్సీపీ స్పష్టం చేశాయి. దీంతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి కానున్నారు. ఇక, ముఖ్యమంత్రి పదవి శివసేన తీసుకుంటుండగా ఉప ముఖ్యమంత్రి పదవులను కాంగ్రెస్, ఎన్సీపీకి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. శివసేన, ఎన్సీపీ 14 మంత్రి పదవుల చొప్పున తీసుకోనున్నాయి. కాంగ్రెస్కు 12 మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఇదంతా బాగానే ఉన్న శనివారం గవర్నర్తో జరగాల్సిన ఈ పార్టీ నేతల భేటీ అనూహ్యంగా వాయిదా పడింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా