newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒక్క అంగుళం కూడా వదులుకోం.. చైనాకు తేల్చిచెప్పిన రాజ్‌నాథ్

07-09-202007-09-2020 12:03:41 IST
2020-09-07T06:33:41.227Z07-09-2020 2020-09-07T06:33:36.971Z - - 11-04-2021

ఒక్క అంగుళం కూడా వదులుకోం.. చైనాకు తేల్చిచెప్పిన రాజ్‌నాథ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తన ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి భారత్‌ సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను చైనా గౌరవించాలని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చైనా రక్షణ మంత్రి వెయి ఫెంఘెకు స్పష్టంచేశారు. శుక్రవారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా వీరిద్దరు రెండు గంటల 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. గత మేలో తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి భేటీ ఇదే కావడం గమనార్హం. 

భారత్, చైనా ప్రతినిధులు సరిహద్దుతోపాటు, ఇరుదేశాల సంబంధాలపై నిర్మొహమాటంగా, లోతుగా చర్చించుకున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితుల నిర్వహణలో బాధ్యతాయుతంగా మెలగాలని, అలజడి రేగేలా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉభయపక్షాలు నడుచుకోవాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ చెప్పారు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా బలగాలు పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలకు దిగి ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించాయని రాజ్‌నాథ్‌.. ఫెంఘె దృష్టికి తీసుకెళ్లారు. 

ఉభయ దేశాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలను కొనసాగించాలని, వీలైనంత త్వరగా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. శాంతిని పునరుద్ధరించేలా ఇరు దేశాధినేతల ఏకాభిప్రాయం మేరకు నడుచుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని, దీనివల్ల విభేదాలు వివాదాలుగా మారకుండా ఉంటాయన్నారు. ఎల్‌ఏసీ వెంబడి గల్వాన్‌ లోయలో గత కొద్ది నెలలుగా చేస్తున్న అభివృద్ధి పనుల గురించి రాజ్‌నాథ్‌ చర్చల సందర్భంగా సూత్రప్రాయంగా చెప్పారు. 

సరిహద్దులో భారత బలగాలు వివాదాలకు తావీయకుండా ఎల్లప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా మెలుగుతున్నాయని, అదే సమయంలో భారత సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ పడబోమని తేల్చిచెప్పారు. చైనా అడిగిన అన్ని అంశాలకు రాజ్‌నాథ్‌ బదులిచ్చారని, వారు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చైనా మంత్రి ఫెంఘె రాజ్‌నాథ్‌కు చెప్పారని భారత విదేశాంగ శాఖ  తెలిపింది. 

ద్వైపాక్షిక ఒప్పందాలను కచ్చితంగా అమలు చేయాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని పేర్కొన్నట్లు చెప్పింది. ఉద్రిక్త నివారణకు కలిసి పనిచేయాలని, సంబంధాల పురోగతిపై దృష్టి పెట్టాలని ఫెంఘె చెప్పారంది. వివాదానికి కారణం భారతేనని, చైనా భూభాగాన్ని అంగుళం కూడా వదులుకోబోమని ఫెంఘె చెప్పారంటూ చైనా ఒక ప్రకటన విడుదల చేసి తన వక్రబుద్ధి చాటుకుంది.

              


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle