newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒక్కో టార్గెట్ పూర్తి చేస్తున్నారు..!

11-11-201911-11-2019 08:20:08 IST
2019-11-11T02:50:08.493Z11-11-2019 2019-11-11T02:50:02.187Z - - 12-04-2021

ఒక్కో టార్గెట్ పూర్తి చేస్తున్నారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ద‌శాబ్దాలుగా దేశాన్ని వెంటాడుతున్న స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం ల‌భిస్తోంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ పెట్టుకున్న చిర‌కాల ల‌క్ష్యాల్లో ఒక్కోటి నెర‌వేర్చుకుంటోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.

అమిత్ షా హ‌యాంలో ఏళ్లుగా ప‌రిష్కారానికి నోచుకోని స‌మ‌స్య‌ల‌కు స‌మాధానాలు దొరుకుతున్నాయి. అవి కొంద‌రికి ఆమోద‌మైనా, మ‌రికొంద‌రికి కాక‌పోయినా చ‌రిత్ర‌లో నిలిచిపోయే అడుగులు ప‌డుతున్నాయి.

భార‌తీయ జ‌న‌తా పార్టీ సిద్ధాంతప‌రంగానే కొన్ని ల‌క్ష్యాల‌ను పెట్టుకుంది. ఇందులో జ‌మ్ము క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు ముఖ్య‌మైన‌ది. ఏక్ దేశ్ మే దో విధాన్‌, దో ప్ర‌ధాన్ ఔర్ దో నిషాన్ న‌హి చేలేగా అనేది బీజేపీ సిద్ధాంత‌క‌ర్త‌లు ఇచ్చిన నినాదం. ఇంత‌కాలం క‌నీసం ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేస్తార‌నే ఊహ కూడా భార‌తీయుల‌కు, క‌శ్మీరీ ప్ర‌జ‌ల‌కు ఉండేది కాదు.

బీజేపీ గ‌తంలో అధికారంలోకి వ‌చ్చినా ఇంత సాహ‌సం చేయ‌లేదు. ఇప్పుడు పూర్తి మెజారిటీతో అధికారంలో ఉండ‌టం, బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉండ‌టంతో ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసింది. ఆ త‌ర్వాత తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని అంతా అనుకున్నా, త‌మ ముంద‌స్తు వ్యూహం, అప్ర‌మ‌త్త‌త‌తో పెద్ద‌గా ఇబ్బంది లేకుండా కేంద్రం చూడ‌గ‌లిగింది.

అంత‌కుముందు త్రిపుల్ త‌లాఖ్ విష‌యంలోనూ ముస్లింలు వ్య‌తిరేకించినా బీజేపీ స‌ర్కార్ వెనక్కు త‌గ్గ‌లేదు. త్రిపుల్ త‌లాఖ్‌ను ర‌ద్దు చేసింది. ఇక‌, తాజాగా బీజేపీకి సంబంధం లేక‌పోయినా, సుప్రీం కోర్టు తీర్పు అయినా ఐదు వంద‌ల ఏళ్లుగా దేశాన్ని వెంటాడుతున్న ఆయోధ్య వివాదానికి ఒక ప‌రిష్కారం ల‌భించింది.

అయోధ్య‌లో రామ మందిరం నిర్మించాల‌నే నినాదం బీజేపీ పార్టీని నిల‌బెట్టింది. పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు ఈ నినాదమే జీవం పోసింది.

ఒకానొక ద‌శ‌లో బీజేపీ సైతం రామ మందిరం నిర్మించ‌లేదు అనేలా ఈ వివాదం ముదిరింది. చివ‌ర‌కు సుప్రీం కోర్టు తాజాగా తీర్పుతో అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియ‌ర్ అయ్యింది.

ఇటువంటి తీర్పు వ‌స్తే దేశ‌వ్యాప్తంగా ఎంత‌టి తీవ్ర‌మైన ప‌రిస్థితులు త‌లెత్తుతాయో అనే అనుమానాలు సైతం ప‌టాపంచ‌ల‌య్యాయి. కొంద‌రు మిన‌హా అన్ని వ‌ర్గాల వారు ఈ తీర్పును అంగీక‌రించారు.

దీంతో యాధృచ్ఛిక‌మే అయినా న‌రేంద్ర మోడీ హ‌యాంలో అయోధ్య‌లో రామ మందిరం నిర్మాణం జ‌రిగింద‌నేది చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది.

ఇలా ఒక్కొక్క ల‌క్ష్యాల‌ను అందుకుంటున్న బీజేపీ స‌ర్కార్ త‌దుప‌రి ల‌క్ష్యం ఎంట‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మొద‌ట బీజేపీ మొద‌టి నుంచీ డిమాండ్ చేస్తున్న ఉమ్మ‌డి పౌర‌స్మృతి. ఇప్ప‌టికే దీనిపై క‌స‌ర‌త్తు కూడా ప్రారంభ‌మైంద‌నే ప్ర‌చారం ఉంది.

జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నేది మోడీ ఆలోచ‌న‌. ఏడాది ముందే దేశ‌వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం మోడీ స‌ర్కార్ స్పీడ్ చూస్తుంటే ఇదేం పెద్ద క‌ష్టం కాదు. బ‌య‌ట‌కు ఈ రెండు ల‌క్ష్యాలు బీజేపీ నెక్ట్స్ టార్గ‌ట్స్‌గా క‌నిపిస్తున్నాయి.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle