ఒక్కరోజులో రూ. 170 కోట్ల మద్యం తాగేశారు.. వాతపెట్టిన తమిళనాడు హైకోర్టు
09-05-202009-05-2020 07:51:27 IST
Updated On 09-05-2020 08:57:15 ISTUpdated On 09-05-20202020-05-09T02:21:27.486Z09-05-2020 2020-05-09T02:21:24.085Z - 2020-05-09T03:27:15.110Z - 09-05-2020

తెలుగు రాష్ట్రాలను మించి మద్యం అమ్మకాల విషయంలో ఎవరూ పోటీపడలేనంతగా రికార్డు సృష్టించిన తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు వాత పెట్టింది. లాక్ డౌన్ సడలించిన నేపథ్యంలో గురువారం తెరుచుకున్న మొదటి రోజే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రూ. 170 కోట్లకు చేరుకుని షాక్ కలిగించింది. దీంతో లాక్డౌన్ ఎత్తేసేంత వరకూ మద్యం దుకాణాలు మూసేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, ఆన్లైన్, హోం డెలివరీ పద్ధతుల్లో మద్యం అమ్మకాలకు కోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ వినీత్ కొఠారి, జస్టిస్ పుష్పా సత్యనారాయణలతో కూడిన ప్రత్యేక డివిజన్ బెంచ్ ఈ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. మే 7వ తేదీ నుంచి ప్రభుత్వం వైన్ షాపులు తెరిచేందుకు ఇటీవల కొన్ని షరతులతో కోర్టు అనుమతించింది. అయితే, దుకాణాలు తెరవగానే జనం సామాజిక దూరాన్ని ఏమాత్రం పాటించకుండా పెద్దఎత్తున బారులు తీరడం, నిబంధనలను తుంగలోకి తొక్కడంతో కోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం మూసేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ముందు మే 7 నుంచి వైన్ దుకాణాలు తిరిగి తెరుస్తున్నట్టు ఈనెల 4న తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ జీవోను పలువురు లాయర్లు, సామాజిక కార్యకర్తలు కోర్టులో సవాలు చేశారు. అయితే, కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ, లాక్డౌన్ అమల్లో ఉన్నందున కచ్చితంగా నిబంధనలు పాటించాలంటూ ఆదేశాలిచ్చింది. రికార్డు స్థాయిలో తొలి రోజే రూ.172 కోట్ల మద్యం అమ్మకాలు తమిళనాడులో తొలి రోజు మద్యం అమ్మకాలు జోరుగా ముగిశాయి. లాక్డౌన్ అనంతరం తెరుచుకున్నమొదటి రోజే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక్క రోజే తమిళనాడు ప్రభుత్వం రూ.172 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిపినట్లు తేలింది. లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలను తమిళనాడు ప్రభుత్వం మే 7(గురువారం)నుంచి తిరిగి ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం లాక్డౌన్ సడలింపుల ఇవ్వడంతో కంటైన్మెంట్ జోన్లు మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలోనూ లిక్కర్ సేల్స్‌కు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే చెన్నైలో కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల గ్రేటర్ చెన్నై ప్రాంతంలో మాత్రం మద్యం అమ్మకాలను నిషేధించింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 44 రోజులపాటు మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు పండగ చేసుకుంటున్నారు. దొరికిందే అదునుగా భావించి తెగ తాగుతూ రికార్డు సృష్టిస్తున్నారు. ఏ మద్యం దుకాణం ముందు చూసినా కిలోమీటర్లమేర మందుబాబులు బారులు తీరుతున్నారు. ఒక్క సీసా దొరికినా చాలు అంటూ దుకాణాల ముందు ఎగబడుతున్నారు. అయితే మద్యం దుకాణాల ముందు సామాజిక దూరం పాటించని, మాస్కులు లేని వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక తమిళనాడులో కొత్తగా 580 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 5,409కి చేరింది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా