newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏ పత్రాలూ అడగం.. జాతీయ జనాభా పట్టికపై షా కీలక ప్రకటన

13-03-202013-03-2020 12:34:44 IST
2020-03-13T07:04:44.781Z13-03-2020 2020-03-13T07:04:42.339Z - - 22-04-2021

ఏ పత్రాలూ అడగం.. జాతీయ జనాభా పట్టికపై షా కీలక ప్రకటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత రెండునెలలుగా దేశాన్ని కుదిపేస్తున్నజాతీయ జనాభా పట్టిక సమస్యపై కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా రాజ్యసభ సాక్షిగా గురువారం కీలక ప్రకటన చేశారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) కోసం దేశ పౌరులు ఎటువంటి ధ్రువీకరణ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని అమిత్‌ షా తెలిపారు. ఎవర్నీ అనుమానితులుగా ప్రకటించబోమని స్పష్టం చేశారు. 

ఢిల్లీ అల్లర్లపై గురువారం రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘ఎన్‌పీఆర్‌ కోసం ఏ పత్రాలూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు వారి దగ్గర ఏ సమాచారం ఉంటే అది ఇస్తేచాలు. మిగతా ప్రశ్నలను ఖాళీగా వదిలేయొచ్చు’’ అని వివరించారు.

అనుమానితులు అనే డౌట్‌పుల్ ‘డి’ని జనాభా పట్టిక నుంచి తొలగిస్తారా అన్న కాంగ్రెస్‌ సభ్యులు ప్రశ్నించగా అమిత్‌ షా బదులిచ్చారు. ‘‘ఎన్‌పీఆర్‌ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎన్‌పీఆర్‌ను తాజాపరిచే ప్రక్రియలో ఎవర్నీ అనుమానితులుగా మార్కు చేయబోము’’ అని తెలిపారు. 

ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని అమిత్‌షా పునరుద్ఘాటించారు. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని, లేదంటే లేదని స్పష్టం చేశారు. ఎన్పీఆర్ జాబితాలో ‘సందేహాస్పద’ (డి) అనే కేటగిరీ ఉండదని ప్రకటించారు. ఎన్పీఆర్ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.

ఈ విషయంపై ఎవరికైనా సందేహముంటే, వాటిని తీర్చడానికి కేంద్ర హోంశాఖా సదా సిద్ధంగానే ఉందని ఆయన ప్రకటించారు. సీఏఏ విషయంలో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. సీఏఏతో ఎవరి పౌరసత్వం రద్దు కాదని, పైగా పౌరసత్వం లభిస్తుందని అమిత్‌షా తెలిపారు. 

ఎన్‌పీఆర్‌ ప్రక్రియను చేపట్టేది లేదని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించిన తెలిసిందే. ఎన్‌పీఆర్‌లో ప్రశ్నలకు ప్రజలు సమాధానాలు ఇవ్వకపోతే ఆ ఇళ్లకు ‘డి’ ముద్ర వేస్తారన్న భయాలూ ఉన్నాయి. 

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ చట్టం, జాతీయ జనాభా పట్టిక అనే మూడు అంశాలను కలపడం ద్వారా దేశంలోని లక్షలాదిమంది ముస్లింలకు పౌరసత్వం లేకుండా చేస్తుందని భయాందోళనలు చెలరేగిన నేపధ్యంలో గత రెండు నెలలుగా దేశం అట్టుడికిపోతోంది. 2015 తర్వాత మతపరమైన అణచివేత కారణంగా పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చే ముస్లిమేతరులకు సీఏఏ భారత పౌరసత్వాన్ని కల్పించనుంది.

దేశంలోని ముస్లింలకు పౌరసత్వం లేకుండా చేయనున్నారన్న పుకార్లతో కాంగ్రెస్, వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ పౌరపట్టికను అమలు చేసేది లేదని ప్రకటించాయి. చివరకు బీజేపీ పొత్తుతో బీహార్ ప్రభుత్వాన్ని నడుపుతున్న జేడీయూ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఎన్‌పిఆర్ అమలును వ్యతిరేకించారు.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle