newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఏ నిమిషానికి ఏమి జరుగునో?

23-07-201923-07-2019 09:08:09 IST
Updated On 23-07-2019 11:01:51 ISTUpdated On 23-07-20192019-07-23T03:38:09.455Z23-07-2019 2019-07-23T03:37:58.693Z - 2019-07-23T05:31:51.812Z - 23-07-2019

ఏ నిమిషానికి ఏమి జరుగునో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 కర్నాటక రాజకీయ అంకం చివరి దశకు చేరుకుంది. మంగళవారం అసెంబ్లీ సంక్షోభానికి తెరపడనుంది. ఈ మేరకు స్పీకర్ రమేష్ కుమార్ ఈ సాయంత్రం ఆరుగంటలలోపు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. దీంతో సీఎం కుమారస్వామి భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

మరోవైపు ఎలాగైనా సరే ఇవాళ విశ్వాసపరీక్ష జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరగా.. బలపరీక్షను బుధవారం వరకు వాయిదా వేయాలని సీఎం కుమారస్వామి కోరారు. అయితే స్పీకర్ మాత్రం విశ్వాసపరీక్ష వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదాపడింది. చివరికి స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు.

మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుందనీ, బలపరీక్షను సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని ప్రకటించారు. సాయంత్రం 6గంటల్లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తైపోతుందని స్పష్టం చేశారు.

రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి.. తనను కలవాలని స్పీకర్ ఆదేశించారు. ఒకవేళ నేడు విశ్వాస పరీక్ష జరగకపోతే... బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ వజుభాయ్ వాలాను కలిసే అవకాశం ఉంది.

ఎలాగైనా ఇవాళ విశ్వాసపరీక్ష నిర్వహించేలా వత్తిడి చేయనున్నారు యడ్యూరప్ప. విశ్వాస పరీక్ష నిర్వహించడంలో స్పీకర్ తీరు పట్ల ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న గవర్నర్ ఇవాళ కూడా బలపరీక్ష జరగకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

కాంగ్రెస్‌ నేత, మంత్రి బైరె గౌడ స్పందిస్తూ.. ‘విశ్వాసపరీక్షను బుధవారానికి వాయిదా వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకోకుండా బలపరీక్ష చేపడితే సభ పవిత్రతే దెబ్బతింటుంది. ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్వచ్ఛందమా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా?

దేశంలో ప్రతిపక్షాన్ని ఓ ప్రణాళికతో బీజేపీ నిర్మూలిస్తోంది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యపు రక్త బీజేపీ చేతులకు అంటుకుంది’ అని ఘాటుగా విమర్శించారు. 

ఇటు బీజేపీ నేతలు కూడా కుమారస్వామిపై మండిపడుతున్నారు. సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ సోమవారం డిమాండ్‌ చేసింది.

ఇవాళ అసెంబ్లీ రెండవ సెషన్‌లో స్పీకర్ విశ్వాస పరీక్షను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. స్పీకర్ విశ్వాస పరీక్ష చేపట్టినా.. లేక గవర్నర్ చట్టపరమైన చర్యలకు సిద్దమైనా.. సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడినట్టుగానే భావిస్తున్నారు. ఏనిమిషానికి ఏమి జరుగునో? 

 

ఎల్జీ పాలిమర్స్ ఘటన....  సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

ఎల్జీ పాలిమర్స్ ఘటన.... సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

   25 minutes ago


విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

   35 minutes ago


‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

   2 hours ago


కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

   2 hours ago


గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

   3 hours ago


టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

   3 hours ago


టెస్టుల్లో ఆలస్యం నిజమే.. క్వారంటైన్లో నాణ్యమైన ఆహారం

టెస్టుల్లో ఆలస్యం నిజమే.. క్వారంటైన్లో నాణ్యమైన ఆహారం

   16 hours ago


టీటీడీలో ఉద్యోగులకు భారీగా కరోనా పరీక్షలు

టీటీడీలో ఉద్యోగులకు భారీగా కరోనా పరీక్షలు

   16 hours ago


డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్

డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్

   21 hours ago


విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్.. తిరిగి రావాల్సిందేనా?

విదేశీ విద్యార్ధులకు అమెరికా షాక్.. తిరిగి రావాల్సిందేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle