newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏటీఎంల ద్వారా బియ్యం పంపిణీ.. కర్ణాటక రికార్డు

03-09-202003-09-2020 06:49:52 IST
Updated On 03-09-2020 07:41:53 ISTUpdated On 03-09-20202020-09-03T01:19:52.093Z03-09-2020 2020-09-03T01:19:50.358Z - 2020-09-03T02:11:53.959Z - 03-09-2020

ఏటీఎంల ద్వారా బియ్యం పంపిణీ.. కర్ణాటక రికార్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొన్ని వారాల క్రితం నీటి ఎటీఎంలు.. ఇప్పుడు బియ్యం ఏటీఎంలు.. ప్రజా పంపిణీ వ్యవస్థలో నిత్యావసర వస్తువులను నిర్ణీత సమయాల్లో మాత్రమే కాకుండా 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచేలా కర్ణాటక ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కుతూ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. 

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) పథకం లబ్దిదారులకు నిరంతరం బియ్యం అందుబాటులో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బియ్యం ఏటీఎంలను ఏర్పాటు చేసి, వారంలో అన్ని రోజులూ, రోజులో 24 గంటలూ బియ్యం అందజేయాలని నిర్ణయించింది. 

బియ్యం ఏటీఎంలను కర్ణాటకలో వివిధ చోట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వివరాలను కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కే గోపాలయ్య తెలిపారు.  బియ్యం ఏటీఎంలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు బారులు తీరి నిల్చోవలసిన అవసరం ఉండబోదని గోపాలయ్య చెప్పారు. వియత్నాంలో అమలు చేస్తున్న విధానాన్ని తాము ఆదర్శంగా తీసుకున్నామన్నారు. తాము మొదట రెండు ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తామని, అవి విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. 

కోవిడ్-19 అష్ట దిగ్బంధనం సమయంలో వియత్నాం, ఇండోనేషియా ప్రభుత్వాలు బియ్యం పంపిణీ యంత్రాలను ఏర్పాటు చేశాయి. ప్రజలకు ఉచితంగా వీటి ద్వారా బియ్యం అందజేయడంలో విజయం పొందాయి కూడా. 

ప్రారంభంలో వంద కేజీల నుంచి 500 కేజీల బియ్యం రైస్ ఎటీఎంల నుంచి వినియోగదారులు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. బియ్యం అవసరమైన వ్యక్తి రైస్ ఎటీఎంలో నాణెం వేస్తే నిర్దిష్ట మొత్తంలో బియ్యం బయటకు వస్తుందని కర్ణాటక మంత్రి గోపాలయ్య చెప్పారు. దీనికోసం స్మార్ట్ కార్డు లేదా బ్యాంక్ ఏటీఎమ్‌ల తరహాలో బయో మెట్రిక్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1800 వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేసి తాగునీటిని అందించింది. బెంగళూరులో 5 రూపాయలకు 20 లీటర్ల చొప్పున మినరల్ వాటర్‌ని ఈ నీటి ఎటీఎంల ద్వారా అందిస్తున్నారు. నగరంలో ప్రతి కార్పొరేషన్ వార్డులో ఒక వాటర్ ఏటీఎం నెలకొల్పడాన్ని బట్టి ఈ పథకం ఎంత విజయవంతమయిందో చెప్పవచ్చు. 

భారత్‌లో ఈ తరహా పంపిణీకి మొట్టమొదటగా కర్ణాటక శ్రీకారం చుడుతోంది. ఇది విజయవంతంగా అమలైతే దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ రూపురేఖలే మారిపోయనున్నాయని పరిశీలకుల వ్యాఖ్య.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle