ఏచూరీకి షాకిచ్చిన పార్టీ.. ఇక పెద్దల సభ కలే
15-03-202015-03-2020 08:22:11 IST
Updated On 15-03-2020 08:24:27 ISTUpdated On 15-03-20202020-03-15T02:52:11.689Z15-03-2020 2020-03-15T02:52:05.367Z - 2020-03-15T02:54:27.800Z - 15-03-2020

పెద్దల సభకు వెళ్ళాలని రాజకీయనేతలు కలలకంటారు. కానీ కొందరికే ఆ కల నిజం అవుతుంది. సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరికి ఈ సారి రాజ్యసభకు దూరం కానున్నారు. ఎగువసభలో ఈ సారి కూడా తాను అడుగు పెడతానని ఆశిస్తున్న ఆయనకు పార్టీ గతంలో ఒకసారి మాదిరే ఈసారి షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఎగువసభకు జరగనున్న ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు సీపీఎం అనుమతించడంలేదు. ఇందుకు నిబంధనలు, పార్టీ కోడ్, రాజకీయ ఒత్తిడులను సాకుగా చూపుతోంది. ఆయనను రాజ్యసభకు పంపరాదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పార్టీలో కేరళ వర్గానిదే పై చేయిగా ఉంది. దీంతో సీతారాం ఏచూరికి బ్రేక్ పడినట్టేనని భావిస్తున్నారు. సీతారాం ఏచూరి. రాజ్యసభలో అధికార పార్టీని ఇరుకున పెట్టగల అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. సీతారాం ఏచూరి గత పన్నెండేళ్ల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పన్నెండేళ్లలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రభుత్వంలోని తప్పిదాలను నిర్భయంగా బయటపెట్టారు. సభలో ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించేవారు. సీతారాం ఏచూరికి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు లేవు. పార్టీ నిబంధనల మేరకు రెండుసార్లకు మించి రాజ్యసభకు ఏ నాయకుడిని పంపే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. సీతారాం ఏచూరి ప్రస్తుతం సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నిజానికి మరోసారి సీతారాం ఏచూరిని రాజ్యసభకు ఎంపిక చేయాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఒకదశలో కాంగ్రెస్ అధిష్టానం కూడా సీతారాం ఏచూరి అభ్యర్థిత్వం పట్ల సానుకూల స్పందించింది. సీతారాం ఏచూరిని పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదనను అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినా అధిష్టానం నచ్చ చెప్పింది. అయితే సీపీఎం నాయకత్వం మాత్రం సీతారాం ఏచూరిని మరోసారి రాజ్యసభకు పంపేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. 2005-2017 మధ్య కాలంలో సీతారాం ఏచూరి 12ఏళ్ళ పాటు ఎగువసభ సభ్యుడిగా ఉన్నారు. 2017 లో ఆయన పదవీకాలం ముగిసింది. అయితే వెస్ట్ బెంగాల్ లో ఆయన అభ్యర్థిత్వానికి మద్దతునిచ్చేందుకు కాంగ్రెస్ సిధ్దపడింది. అప్పట్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చేతిలో సీపీఎం ఓడిపోవడంతో పరిస్థితి మారింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, తృణమూల్ కాంగ్రెస్ ని ఎదుర్కొన్న తరుణంలో ప్రత్యర్థిగా మారిన కాంగ్రెస్ సహాయాన్ని తీసుకోవడమన్నది తమ పార్టీ సిధ్ధాంతాలకు విరుధ్ధమని సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. అయితే సీతారాం ఏచూరి వంటి సీనియర్ నాయకుడికి వ్యతిరేకంగా ఉన్న వర్గమే ఆయనను రాజ్యసభకు పంపేందుకు మోకాలడ్డుతోందని ఆయన అనుకూల వర్గం పేర్కొంటోంది సీతారాం ఏచూరి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషిస్తున్నారు. సీతారాం ఏచూరి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సీతారాం ఏచూరి చిన్న వయసులోనే వామపక్ష భావాలకు ఆకర్షితులయ్యారు. 1969 సమయంలోనే ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని జవహర్ లాల్ యూనిివర్సిటీలో ఎంఏ చదివిన సీతారం ఏచూరి సీపీఎం విద్యార్థి విభాగమైన ఎస్ఎఫ్ఐలో చురుగ్గా పనిచేశారు. ప్రకాష్ కారత్ తర్వాత 2015లో సీతారాం ఏచూరి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన రెండో తెలుగువాడు సీతారాం ఏచూరి మాత్రమే. ఆయన పదవీ బాద్యతలను చేపట్టిన తర్వాత సీపీఎం అనేక రాష్ట్రాల్లో పూర్తిగా కనుమరుగై పోయిందన్న విమర్శలు ఉన్నాయి బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకంచేసేందుకు సీతారాం ఏచూరి అనేక ప్రయత్నాలు చేశారు. పార్టీలో కేరళ నేతల ఆధిపత్యం ఎక్కువ కావడంతోనే సీతారాం ఏచూరి విషయంలో అన్యాయం జరిగిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. సీపీఎం నిర్ణయంతో ఇక రాజ్యసభలో సీతారాం ఏచూరి గళం విన్పించే అవకాశం లే

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
an hour ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago
ఇంకా