ఎవరెస్ట్‌పై చెత్త... తొలగింపుకోసం నేపాల్ తంటాలు
08-06-201908-06-2019 08:29:26 IST
2019-06-08T02:59:26.961Z08-06-2019 2019-06-08T02:59:23.432Z - - 15-12-2019

ఎవరెస్టు పర్వత ప్రక్షాళనకు నేపాల్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా పేరుకుపోయిన చెత్తను క్రమేపీ వెలికితీశారు. రెండు నెలల పాటు సాగిన ఈ ప్రక్రియలో సుమారు 11 వేల కేజీల చెత్తను తొలగించినట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది.
ప్లాస్టిక్ క్యాన్లు, మానవ వ్యర్థాలు, ఆక్సిజన్ బాటిళ్లు, టెంట్లు, తాళ్లు, విరిగిపోయిన నిచ్చెనలు, ఇతర వ్యర్థాలను బయటకు తీశారు. ఎవరెస్టు శిఖరంపై పర్వతారోహకుల మరణాలకు ట్రాఫిక్ జామ్ కూడా ఒక కారణంగా తెలుస్తోంది.
పేరుకుపోతున్న చెత్త, అనారోగ్యవాతావరణం నేపథ్యంలో పర్వతా అధిరోహణపై కొన్ని నిబంధనలు విధించాలని నేపాల్ పర్యాటక శాఖ యోచిస్తోంది. అధిరోహకులకు కనీస అర్హతలు ఉండేలా చూడనుంది.
ఇందులో భాగంగా నాలుగు మృతదేహాలను ఎవరెస్టు ప్రక్షాళన బృందం అధికారులు వెలికితీశారు. అయితే అందులో ఇద్దరు వ్యక్తులు రష్యా, నేపాల్‌కు చెందినవారని గుర్తించారు. ప్రక్షాళన ప్రక్రియలో వివిధ క్యాంపుల్లో సుమారు 5వేల కేజీల చెత్త బయటపడింది.
బేస్ క్యాంపుల కంటే దిగువ భాగాన ఉండే ప్రాంతాల్లో 6వేల కేజీల వ్యర్థాలను తొలగించారు. అయితే సౌత్ కోల్ వద్ద పేరుకుపోయిన చెత్తన తొలగించలేకపోతున్నారు. దీనికి అక్కడి వాతావరణం సహకరించడం లేదని ఆ దేశ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ దండు రాజ్ ఘిమిరే తెలిపారు.
ఒక వైపు టిబెట్ ప్రభుత్వం కేవలం 300 మందికి ఎవరెస్ట్‌ను అధిరోహించే అవకాశం కల్పిస్తుంది. నేపాల్ ప్రభుత్వం మాత్రం అపరిమితంగా పర్వతారోహకులకు అనుమతి మంజూరు చేస్తోంది. త్వరలో నేపాల్ ప్రభుత్వం కూడా పర్వతారోహకుల సంఖ్యపై పరిమితులు విధించనుంది.

పవన్ పార్టీలో ఏమిటీ పరేషాన్ ..?
25 minutes ago

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
13-12-2019

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?
13-12-2019
ఇంకా