newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

26-05-202026-05-2020 17:45:42 IST
Updated On 26-05-2020 19:49:42 ISTUpdated On 26-05-20202020-05-26T12:15:42.993Z26-05-2020 2020-05-26T12:15:25.583Z - 2020-05-26T14:19:42.993Z - 26-05-2020

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖలో సంచలనం కలిగించిన ఎల్పీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో యాజమాన్యానికి చుక్కెదురైంది. ఒక వైపు పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వాలని కోరగా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇటు విశాఖ గ్యాస్ లీక్ ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమను అధికారులు సీజ్ చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆ సంస్థ ప్రాంగణం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులను హైకోర్టు నిర్దేశించింది.

అంతేగాక ఎల్జీ పాలిమర్స్‌ ప్రాంగణంలోకి సంస్థ డైరెక్టర్లతో పాటు ఎవరినీ అనుమతించరాదని స్పష్టం చేసింది. దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న కమిటీలు.. అవసరమైతే పరిసరాల్లోకి ప్రవేశించవచ్చని, అయితే ఆ కమిటీల సభ్యులు తిరిగి వెళ్లేటప్పుడు సంస్థ గేటు వద్ద ఉన్న రిజిస్టర్‌లో.. తనిఖీకి సంబంధించిన విషయాన్ని, పరిశీలించిన అంశాన్ని రికార్డు చేయాలని పేర్కొంది. కోర్టు అనుమతి లేకుండా ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ చర, స్థిరాస్తులు.. అమర్చి ఉన్న సామగ్రి, యంత్రాలు మొదలైన వేటినీ వేరేచోటికి తరలించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. హైకోర్టు ఆదేశాలు అందడంతో జిల్లా యంత్రాంగం హుటాహుటిన పరిశ్రమను సీజ్ చేసేసింది. 

ఇటు ఎల్జీ పాలిమర్స్ సంస్థ కు సుప్రీంలో చుక్కెదురైంది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి అంటూ సంస్థ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎల్‌జీ పాలిమర్స్‌ విజ్ఞప్తి చేసింది.

ఎల్జీ ప్లాంట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఏడు కమిటీల్లో దేనికి హాజరుకావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొంది. ఎన్జీటీ లేదా హైకోర్టు వీటిపై పూర్తిగా దర్యాప్తు చేస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు నిరాకరించింది. ప్లాంట్లోకి వెళ్లడానికి అనుమతివ్వలేదు సుప్రీంకోర్టు. 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   3 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   18 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   7 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   7 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   18-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle