newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

27-01-202027-01-2020 08:43:03 IST
Updated On 27-01-2020 12:16:19 ISTUpdated On 27-01-20202020-01-27T03:13:03.849Z27-01-2020 2020-01-27T03:12:29.060Z - 2020-01-27T06:46:19.264Z - 27-01-2020

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో నవరత్న సంస్థల కథ ఒక్కొక్కటిగా ముగుస్తోంది. తాజాగా బీపీసీఎల్, ఎయిర్ ఇండియా సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నష్టాలతో సతమతమవుతున్న ఎయిర్‌ఇండియాలో నూరు శాతం వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వం సోమవారం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానిస్తోంది. దీనిని ఎవరు దక్కించుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎయిర్‌ఇండియాను కొనుగోలుకు మొగ్గుచూపే బయ్యర్లు ఈ ఏడాది మార్చి 17 నాటికి ఆసక్తి చూపాలి.

ఎయిర్‌ఇండియాను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్‌, హిందూజాలు, ఇండిగో, స్పైస్‌జెట్‌ సహా కొన్ని ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు పోటీ పడనున్నాయి. మరోవైపు దేశీ విమానయాన సంస్థలతో కలిసి కొన్ని విదేశీ ఎయిర్‌లైన్స్‌ కూడా సంయుక్త బిడ్ల ద్వారా బిడ్డింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నాయి. తాను మంత్రిని కాకుంటే ఎయిర్ ఇండియాను తానే కొనుగోలు చేసేవాడినని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. 

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు-2020 కు హాజరైన కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ సంచలన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజు కేంద్రమంత్రిని కాకపోయి ఉంటే ఎయిరిండియా కొనుగోలుకు బిడ్డింగ్ వేసేవాడిని. సమర్థవంతమైన నిర్వహణతో సేవలు అందిస్తున్న ఎయిరిండియా నా దృష్టిలో బంగారు గని. ఎయిరిండియా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆదరణ చూరగొంది’ అని గోయల్ అన్నారు. దీనిపై విపక్షాలు సెటైర్లు వేశాయి. 

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఎయిర్‌ఇండియా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది, దీంతో ఎయిర్ ఇండియాను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. ఎయిర్‌ఇండియాకు విస్తృతంగా ఉన్న దేశీ, విదేశీ నెట్‌వర్క్‌..లండన్‌, దుబాయ్‌ వంటి కీలక విదేశీ విమానాశ్రయాల్లో ట్రాఫిక్‌ రైట్స్‌, స్లాట్‌లు, సాంకేతిక సిబ్బంది కలిగి ఉండటం, పెద్ద సంఖ్యలో విమానాలు ఉండటంతో కొనుగోలుదారులు టేకోవర్‌కు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఎయిర్‌లైన్‌ వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని భావిస్తుండటంతో కొనుగోలుదారులు లేవనెత్తే డిమాండ్లను అంగీకరించి విక్రయ ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

ఎయిర్‌ఇండియా ప్రస్తుతం రోజుకు సగటును రూ 20-25 కోట్ల నష్టంతో నడుస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చడం కేంద్రానికి భారంగా మారింది. దీంతో అమ్మేయడం ద్వారా బయటపడాలని భావిస్తోంది.  ఎయిరిండియా ఎవరి వశం అవుతుందో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle