newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్

31-08-202031-08-2020 11:07:03 IST
Updated On 31-08-2020 11:23:37 ISTUpdated On 31-08-20202020-08-31T05:37:03.498Z31-08-2020 2020-08-31T05:36:55.159Z - 2020-08-31T05:53:37.106Z - 31-08-2020

ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతూనే వుంది. కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్న అనంతరం స్వల్ప అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాను జయించిన అనంతరం అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. కాగా ఈ నెల 2న అమిత్‌ షాకు కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

వైద్యుల సూచనలతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన.. కరోనా నుంచి కోలుకుని ఆగస్ట్‌ 14న ఇంటికి వచ్చారు. అయితే ఒళ్లు నొప్పులు, నిస్సత్తువ తగ్గకపోవడంతో ఆగష్టు 18న అమిత్‌ షా ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ చేరిన సంగతి తెలిసిందే. అత్యుత్తమ వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించింది. ఈ క్రమంలో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,246 చేరింది. ఆదివారం ఒక్కరోజే కోవిడ్‌ బాధితుల్లో 971 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 64,469 కు చేరింది. గత 24 గంటల్లో 60,868 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 27,74,802 మంది కోవిడ్‌ రోగులు కోలుకున్నారు. 

భారత్‌లో ప్రస్తుతం 7,81,975 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 76.61 శాతంగా ఉందని తెలిపింది. అలాగే నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.60  శాతంగా ఉన్నాయని వెల్లడించింది. మరణాల రేటు 1.79 శాతానికి తగ్గిందని పేర్కొంది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 8,46,278 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపింది. దాంతో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 4,23,07,914 కు చేరిందని వెల్లడించింది. రికవరీ కేసులు పెరగడంతో వైద్యులు కాస్త సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   36 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   2 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 minutes ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   5 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   a day ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle