ఎన్–95 మాస్క్‌లు వైద్యులకే.. అవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవు.. కేంద్రం హెచ్చరిక
22-07-202022-07-2020 12:16:36 IST
Updated On 22-07-2020 12:27:02 ISTUpdated On 22-07-20202020-07-22T06:46:36.843Z22-07-2020 2020-07-22T06:46:34.154Z - 2020-07-22T06:57:02.697Z - 22-07-2020

ఎన్–95 మాస్క్‌లు, ముఖ్యంగా రెస్పిరేటరీ వాల్వ్‌లున్న ఎన్–95 మాస్క్‌ల వినియోగంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి మాస్క్‌లు వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని, కరోనాను నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది. వైద్యసిబ్బంది వినియోగానికి ఉద్దేశించిన మాస్క్‌లను అనుచిత రీతిలో సామాన్య ప్రజలు వినియోగిస్తున్న తీరు తమ దృష్టికి వచ్చిందని ఆ లేఖలో ఆరోగ్య శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా ఉపయోగించే ఎన్-95 మాస్కులు కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని, వీటిని సామాన్య ప్రజలు ఇష్టానుసారం వాడినప్పటికీ వారి నుంచి ఇతరులకు వైరస్ సోకుండా అడ్డుకోలేవని కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ గార్గ్ హెచ్చరించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలు జాగరూకతతో ఉండాలని ఆయన సూచించారు. ప్రధానంగా గాల్లో తేలియాడుతున్న వైరస్ కణాలనుంచి ఎన్95 మాస్కులు వాటిని ధరించిన వారికి రక్షణ కల్పిస్తాయి అంతే తప్ప అప్పటికే వైరస్‌కు గురైన వారు ఈ తరహా మాస్కులు వాడినప్పటికీ వారి నుంచి వైరస్ ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి వైద్య సిబ్బంది కాకుండా ఇతరులు ఎన్-95 మాస్కులను ఉపయోగించడం పూర్తిగా నిలిపివేసేలా తదు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను హెచ్చరించింది. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్95 మాస్కులు అవి ధరించివారికి కరోనా వైరస్ సోకకుండా అడ్డుకుంటాయి తప్పితే అవి ధరించిన వారినుంచి వైరస్ బయటకు వెళ్లకుండా నిరోధించలేవు. అందుకే సామాన్య ప్రజలు వాటిని వాడినప్పటికీ వారిలో వైరస్ ఉంటే అది ఇతరులకు వ్యాపించకుండా ఎన్ 95 మాస్కులు అరికట్టలేవని తాజా సమాచారం. అందుకే ఇంట్లో తయారు చేసుకునే మాస్క్‌లను వినియోగించేందుకు మార్గదర్శకాలు ఆరోగ్య శాఖ వెబ్సైట్లో ఉన్నాయని, వాటిని ప్రచారం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
an hour ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
6 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
20 hours ago
ఇంకా