newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎన్సీపీలో చీలిక.. అజిత్ ప్లాన్ సక్సెస్

23-11-201923-11-2019 12:48:23 IST
2019-11-23T07:18:23.122Z23-11-2019 2019-11-23T07:18:15.323Z - - 12-04-2021

ఎన్సీపీలో చీలిక..  అజిత్ ప్లాన్ సక్సెస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహా రాజకీయాల్లో అర్థరాత్రి హంగామా

అజిత్ తిరుగుబాటు చేశారా?

ఎన్సీపీలో సగంమంది బీజేపీకి సపోర్ట్

 అమిత్ షా చక్రం తిప్పారా?

శివసేన-కాంగ్రెస్ పరిస్థితేంటి?

చేతిదాకా వచ్చి అధికారం చేజారిందా?

చేతిదాకా వచ్చింది నోటికి అందకపోవడం అంటారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమికి ఇది అనుభవంలోకి వచ్చింది. సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు చకచకా సిద్ధం అవుతున్న ఈ కూటమికి కాషాయ పార్టీ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ మద్దతు ప్రకటించడంతో మహారాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన, కాంగ్రెస్‌ నేతలతో పాటు శరద్‌ పవార్‌కు ఊహించిన షాక్‌ ఇచ్చారు అజిత్ పవార్. ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడం, వెంటవెంటనే ప్రమాణం చేయించడం జరిగిపోయింది.

అజిత్ పవార్ ఎన్సీపీలోని సగంమంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుని బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామం వెనుక అమిత్ షా వ్యూహం ఉందంటున్నారు. ఈనెల 30లోపు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్‌సింగ్‌ కోశ్యారీ బీజేపీ సూచించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్షలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠను రేపుతోంది.  ఫడ్నవిస్‌కు ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వకపోతే కష్టం. దీంతో ప్రభుత్వాన్ని నెగ్గించుకునేందుకు బీజేపీ, ఫడ్నవిస్‌ను గద్దెదించేందుకు విపక్షాలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి.

288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్‌ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు వున్నారని చెబుతున్నారు. ఈ లెక్కన ప్రభుత్వానికి 147 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. బల పరీక్షకు వారానికి పైగా గడువు ఉంది.

దీంతో ఎన్సీపీలో ఇంకా మిగిలివున్న రెబల్స్‌పై కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. బలపరీక్షలో సరిపడ ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే మరికొందరిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారికి అవసరమయితే మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా ఎన్సీపీ-బీజేపీ రెడీ అవుతున్నాయి.

గతంలో కర్నాటకలో యడియూరప్పకు ఎదురైన అనుభవం రాకుండా బీజేపీ తెగ జాగ్రత్తలు తీసుకుంటోంది. శివసేనను దెబ్బకొట్టేందుకు మరిన్ని ఎత్తుగడలు కూడా వేస్తోంది. ఇదిలావుండగా తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్‌ నేతలు అలర్టయ్యారు. ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి రెండుపార్టీలు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle