newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎన్నికల గురించి మాట్లాడేందుకు మీరెవరు.. జేకే గవర్నర్‌కు ఈసీ మందలింపు

29-07-202029-07-2020 13:19:17 IST
2020-07-29T07:49:17.516Z29-07-2020 2020-07-29T07:49:00.345Z - - 23-04-2021

ఎన్నికల గురించి మాట్లాడేందుకు మీరెవరు.. జేకే గవర్నర్‌కు ఈసీ మందలింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల సంఘం విధుల్లో తమరి జోక్యం అనసరం అంటూ జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు భారత ఎన్నికల సంఘం గడ్డి పెట్టింది. జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్మును ఈసీ తీవ్రంగా మందలించింది. ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. ఓ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఈ విధంగా బహిరంగంగా ప్రకటన జారీ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. 

న్యూఢిల్లీ  భారత ఎన్నికల సంఘం (ఈసీ) అత్యంత అరుదైన రీతిలో స్పందించింది. లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము ఇటీవల జమ్మూ-కశ్మీరులో ఎన్నికలు జరిగే సమయం గురించి మాట్లాడారు. ఇది ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని, ఇది సరైనది కాదని ఈసీ స్పష్టం చేసింది. 

గత నెలలో ముర్ము ఓ పత్రికతో మాట్లాడుతూ, జమ్మూ-కశ్మీరు శాసన సభకు ఎన్నికలు నిర్వహించేందుకు కోవిడ్-19 మహమ్మారి మినహా వేరొక సమస్య ఏదీ లేదన్నారు. ముర్ము తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత జమ్మూ-కశ్మీరు శాసన సభకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 

దీంతో ఎన్నికల కమిషన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటువంటి ప్రకటనలపట్ల ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగ విధానాల ప్రకారం, ఎన్నికల నిర్వహణ సమయం వంటివన్నీ భారత ఎన్నికల సంఘం పరిథిలోకి మాత్రమే వస్తాయి అని పేర్కొంది. 

ఇటువంటి ప్రకటనలు చేయకుండా, ఎన్నికల సంఘం మినహా, ఇతర వ్యవస్థలు సంయమనం పాటించడం సరైనదవుతుందని పేర్కొంది. ఇటువంటి ప్రకటనలు చేయడం భారత ఎన్నికల సంఘానికి రాజ్యాంగబద్ధంగా లభించిన అధికార పరిథిలో జోక్యం చేసుకోవడమే అవుతుందని పేర్కొంది. 

ఎన్నికల నిర్వహణ తేదీలను ప్రకటించడానికి ముందు సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, ప్రాంతీయ, స్థానిక పండుగల వల్ల కలిగే ప్రభావం వంటివాటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల తేదీలను నిర్ణయిస్తామని తెలిపింది. 

ఎన్నికల కమిషన్ ఇలా గవర్నర్ స్థాయి రాజ్యాంగ అధికారులను మందలించడం ఇది రెండోసారి. 2016 జూన్ 1 లోగా తమిళనాడు లోని అరవకుచ్చి, తంజావూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ నాడు రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్య ఎన్నికల ప్యానెల్‌ను కోరారు. 

ఆయన సూచనను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం వాతావరణం బాగాలేదని చెబుతూ ఆ రెండు అసెంబ్లీలకు ఎన్నికలను రద్దు చేసింది.

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle