ఎన్నికలకు స్టాలిన్ స్ట్రాటజీ...డీఎంకే సేవల్లో పీకే
03-02-202003-02-2020 08:10:39 IST
2020-02-03T02:40:39.966Z03-02-2020 2020-02-03T02:40:33.481Z - - 23-04-2021

ఏపీలో జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎనలేనిది. చంద్రబాబుని ధీటుగా ఎదుర్కొని ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీలో ఎన్నికలకు వెళ్ళారు జగన్. ఆయన వెంట నడుస్తూ వ్యూహాత్మక అడుగులు వేయిస్తూ... 151 సీట్లు కొల్లగొట్టారు. ఈ తరహా విజయంతో ప్రశాంత్ కిషోర్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. జేడీయూ కూడా ఆయనకు పదవి ఇచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో జేడీయూ నేతలు ఆయన్ని పదవినుంచి సస్పెండ్ చేశారు. అప్పటికే పీకే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెంట నడిచారు. హస్తిన పీఠం మళ్ళీ ఆప్ వశం కావడానికి పీకే ప్లాన్ వేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఆప్ దే విజయం అని సర్వేలు చెబుతున్నాయి. దీంతో పీకేని తన వైపు లాక్కునేందుకు టీఎంసీ ప్రయత్నించింది. టీఎంసీ కూడా ఆప్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణాదిన అధికారం కోసం తహతహలాడుతోంది డీఎంకె పార్టీ. అమ్మ జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అధికారం కోసం తపిస్తున్నారు డీఎంకె చీఫ్ స్టాలిన్. తన తండ్రి కరుణానిధి అడుగుజాడల్లో నడుస్తున్న స్టాలిన్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోవాలని డీఎంకే భావిస్తోంది. తమిళనాడులో 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన సంస్థ ఐ ప్యాక్ సాయం తీసుకుంటామని డీఎంకే అధినేత స్టాలిన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. స్టాలిన్ ట్వీట్‌పై ఐప్యాక్ కృతజ్ఞతలు తెలపడం విశేషం. ‘2021లో విజయమే లక్ష్యంగా తమిళనాడులో డీఎంకేతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నాం’ అని ట్వీట్ చేసింది. పదేళ్లుగా విపక్షంలో ఉంటున్న డీఎంకే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అన్నాడీఎంకే నుంచి అధికారం చేజిక్కుంచుకోవాలని భావిస్తోంది. సినీ నటుడు కమల్‌హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహాలను వాడుకోనుందని కొంత కాలంగా వార్తలు వస్తున్నా.. ఆయన కంటే ముందే డీఎంకె రంగంలోకి దిగడం చర్చనీయాంశం అయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే 2019 లోక్ సభ ఎన్నికలను డీఎంకే దాదాపు స్వీప్ చేసింది. మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో 38 సీట్లను డీఎంకే గెలుచుకోవడంతో ఇక మిగిలింది అసెంబ్లీయే. అన్నాడీఎంకె వ్యూహాలను తిప్పికొడుతూ ప్రశాంత్ కిషోర్ సాయంతో స్టాలిన్ సీఎం పీఠంపై కూర్చోవాలని తహతహలాడుతున్నారు. మరి పీకే ప్లాన్.. స్టాలిన్ స్ట్రాటజీ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
4 minutes ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా