newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎన్నడూ లేని విధంగా పరిమిత అతిథులతో ఎర్రకోట వేడుక

15-08-202015-08-2020 10:02:32 IST
Updated On 15-08-2020 10:17:08 ISTUpdated On 15-08-20202020-08-15T04:32:32.499Z15-08-2020 2020-08-15T04:31:16.932Z - 2020-08-15T04:47:08.872Z - 15-08-2020

ఎన్నడూ లేని విధంగా పరిమిత అతిథులతో ఎర్రకోట వేడుక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి అన్ని వేడుకలను ప్రభావితం చేస్తోంది. దేశ స్వాతంత్ర్య వేడుకలు గతంతో ఎంతో వైభవంగా జరిగేవి. కానీ ఈసారి అంత హడావిడి కనిపించలేదు. ప్రధాని ఏం మాట్లాడబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. కరోనా తీవ్రత, చైనా కవ్వింపులపై ఎలాంటి సందేశం ఇస్తారనే ఉత్కంఠ ఏర్పడింది. అంతా భావించినట్టుగా ఎర్రకోటపై ఆనవాయితీగా వస్తోన్న ప్రధాని ప్రసంగంలో ఈసారి కూడా అనేక విశిష్టతలు కనిపించాయి. 

ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లుచేశారు అధికారులు. కరోనా దృష్ట్యా వేడుకల్లో వ్యక్తిగత దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట ప్రాంగణంలో కుర్చీల మధ్య 2 గజాల దూరం ఏర్పాటుచేశారు. ఎర్రకోట ప్రాంగణంలో శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్‌ ఏర్పాట్లు చేశారు. 

కరోనా దృష్ట్యా 150కి కుదించారు అతిథుల జాబితా. పెరేడ్‌లో  350 మంది ఢిల్లీ పోలీసులు పాల్గొన్నారు. వేడుకల దృష్ట్యా 14 రోజుల ముందే క్వారంటైన్‌లో పెరేడ్‌లో బలగాలను వుంచారు. వేడుకల్లో వీవీఐపీలు, త్రివిధ దళాల సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు, కరోనా యోధులు పాల్గొన్నారు. ఏటా 30 వేల మందికిపైగా హాజరయ్యే కార్యక్రమంలో ఈసారి 4 వేల మందితో నిర్వహించారు. స్వాతంత్ర్య వేడుకల కోసం ఎర్రకోట పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ఉదయం 7.30కి ఎర్రకోటపై ఏడోసారి జాతీయ జెండా రెపరెపలాడింది. ప్రధాని నరేంద్రదామోదర్ మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో ఆయన ముఖానికి మాస్క్ ధరించలేదు. కరోనాను కూడా లెక్క చేయకుండా ఆయన ధైర్యంగా వేడుకల్లో పాల్గొన్నారు. జెండా వందనం తర్వాత దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నో రంగాలపై, ఎంతో మందిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిందన్న ప్రధాని మోదీ... ఈ కరోనాపై పోరాటంలో మనం సంకల్ప శక్తితో విజయం సాధించగలమనే నమ్మకం ఉందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కలసికట్టుగా ముందుకు సాగుతూ విజయం సాధించాలన్నారు. కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణతో ముందుకువెళ్లాలన్నారు. 

భారత్ అభివృద్ధి చెందితే.. విశ్వ కళ్యాణానికి అది మేలు చేస్తుందన్నారు. ముడి సరుకులు ఎగుమతి చేసి... విదేశాల నుంచి ఉత్పత్తులు, వస్తువులు దిగుమతి చేసుకోవడం ఎన్నాళ్లని ప్రశ్నించిన ప్రధాని మోదీ... ఈ పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. వ్యవసాయం, ఆరోగ్య రంగం, టూరిజం రంగం ఇలా చాలా రంగాల్లో భారత్ దూసుకెళ్లడం అనివార్యమన్న ప్రధాని మోదీ... భారత్‌లో తయారయ్యే వస్తువుల్ని విదేశాలకు భారీగా ఎగుమతి చెయ్యాలన్నారు.

అంతకు ముందు... 7.20కి ఎర్ర కోటకు మాస్కుతో వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... సైనిక వందనం స్వీకరించే సమయంలో మాత్రం మాస్క్ ధరించలేదు.అంతకు ముందు ప్రధాని మోదీ... బాపూ ఘాట్ దగ్గర... మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ... దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈసారి ఎర్రకోట వేడుకల్లో 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొన్నారు. ఈసారి విద్యార్థులు పాల్గొనలేదు. కొన్ని దేశాల దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, కరోనాను జయించిన పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు... మొత్తంగా 4 వేల మంది మాత్రమే ఈసారి వేడుకల్లో పాల్గొన్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ప్రధాని మోదీ కోరిన ఆత్మ నిర్భర భారత్ దిశగా దేశ ప్రజలు అడుగులు వెయ్యాలని కోరారు.

ఎర్రకోట సమీపంలో నాలుగు కోవిడ్-4 టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏదైనా కారణంతో అతిథులు మాస్క్‌లు తీసుకురాలేని పక్షంలో... వారికి అందజేసేందుకు మాస్క్‌లను, శానిటైజర్లను కూడా అక్కడ అందుబాటులో ఉంచారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle