newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎన్డీయేకి శివసేన గుడ్ బై.. కేంద్రమంత్రి అరవింద్ రాజీనామా

11-11-201911-11-2019 13:30:42 IST
Updated On 11-11-2019 13:30:35 ISTUpdated On 11-11-20192019-11-11T08:00:42.829Z11-11-2019 2019-11-11T08:00:16.158Z - 2019-11-11T08:00:35.775Z - 11-11-2019

ఎన్డీయేకి శివసేన గుడ్ బై.. కేంద్రమంత్రి అరవింద్ రాజీనామా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం తనకు లేదని చేతులెత్తేయడంతో శివసేనకు గవర్నర్ ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. శివసేన నేత, కేంద్ర భారీపరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో శివసేన ఎన్డీయేలో కొనసాగడం సమజసం కాదని బయటకు వస్తున్నామన్నారు.

అరవింద్ సావంత్ బయటకు రావడంతో శివసేన బీజేపీకి దూరం అవుతోందని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ఎన్డీయేనుంచి బయటకు రావాలని శరద్ పవార్ షరతు విధించిన సంగతి తెలిసిందే.

దీంతో శివసేన ఆ దిశగా అడుగులు వేస్తోంది.తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం గ్యారంటీ అని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం నెలకొల్పాలంటే 145 సీట్లు కావాలి. బీజేపీ మినహా ఈ మూడు పార్టీలు కలిస్తే మొత్తం 154 సీట్ల మెజారిటీ లభిస్తుంది. 

ఇదిలా ఉంటే శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అహంకారం వల్లే పరిస్థితులు ఇలామారాయన్నారు. బీజేపీ తన మాట మీద తాను నిలబడలేదని, అందుకే తాము బయటకు వచ్చామన్నారు. ఎన్నికల ముందు ఒప్పుకున్న మాటకు వారు కట్టుబడి ఉండలేదన్నారు. బీజేపీ-శివసేన మధ్య ఇక బంధం చెడిపోయినట్లే అన్నారు సంజయ్ రౌత్.

ఎన్డీయే నుంచి బయటకు వచ్చి రాజీనామాకు సిద్ధపడ్డ శివసేన నేత అరవింద్ రాజీనామాపై శరద్ పవార్ స్పందించారు. రాజీనామా సంగతి తనకు తెలియదన్నారు. కాంగ్రెస్ ఏ విధమయిన షరతులు విధిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శివసేనకు సీఎం పదవి, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు డిప్యూటీ సీఎం పదవులు రావచ్చని తెలుస్తోంది. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle