newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎన్ఐఏ ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్.. అదుపులో ఏడుగురు?

21-12-201921-12-2019 14:17:09 IST
Updated On 21-12-2019 14:17:07 ISTUpdated On 21-12-20192019-12-21T08:47:09.325Z21-12-2019 2019-12-21T08:45:02.030Z - 2019-12-21T08:47:07.297Z - 21-12-2019

ఎన్ఐఏ ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్.. అదుపులో ఏడుగురు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాగరతీరం విశాఖలో ఏంజరుగుతోంది?

మనదేశ నౌకాదళ రహస్యాలు బయటికి వెళ్లిపోతున్నాయా?

ఇదంతా ఇంటి దొంగల పనేనా?

విశాఖలో ఎన్ఐఏ భారీ ఆపరేషన్ 

ఎన్ఐఏ అదుపులో ఏడుగురు అధికారులు

గూఢచర్యంతో ఉలిక్కిపడ్డ విశాఖనగరం 

విశాఖ సాగరతీరం అక్రమార్కులకు, గూఢచారులకు అడ్డాగా మారుతోంది. దేశద్రోహులు మన రహస్యాలను ఇతర దేశాలకు ముఖ్యంగా మన శత్రుదేశం పాకిస్థాన్ కు చేరవేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడవుతోంది. దీంతో ఎన్ఐఏ విశాఖలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ అనే పేరు కూడా పెట్టింది. ఈ దర్యాప్తులో పాకిస్తాన్ దేశ అధికారులకు మన నౌకాదళ అధికారిక సమాచారం ఇస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అదుపులో వున్న ఏడుగురు మన దేశానికి చెందిన వివిధ సబ్ మెరైన్స్, ఇండియన్ షిప్ లకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఐఎస్ఐకి అందిస్తున్నట్టు తేలింది. 

నేవీ కి చెందిన ఏడుగురిని అధికారులను అదుపులోకి తీసుకోవడంతో విశాఖలో ఏదో జరుగుతోందన్న అనుమానం కలుగుతోంది. కేంద్ర నిఘా వర్గాలు ,ఆంధ్రప్రదేశ్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. హవాలా బ్రోకర్ ద్వారా సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నారు ఏడుగురు నేవీ అధికారులు. సముద్రతీర మార్గానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేర వేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.

అరెస్ట్ అయిన వారంతా దేశంలో వివిధ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. తూర్పునౌకాదళానికి కీలకమైన డాల్ఫిన్స్ నోస్ కేంద్రంగా గూఢచర్యం రాకెట్ వీరు నడుపుతున్నారని అధికారులు అనుమానించారు. అరెస్టైన ఏడుగురినీ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టగా వారికి కోర్టు జనవరి 3 వరకూ రిమాండ్ విధించింది. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle