ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా ఖర్చుపెట్టలేరా?
11-07-201911-07-2019 08:11:22 IST
2019-07-11T02:41:22.907Z11-07-2019 2019-07-11T02:41:17.540Z - - 15-04-2021

ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంటు స్థానం ఉంటుంది. పార్లమెంటు సభ్యులకు ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు కేటాయిస్తుంది. ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ప్రజలకు కావల్సిన సౌకర్యాలు కల్పించే అవకాశం వుంటుంది. ప్రతి పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గంలో స్థానికంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం 1993లో ఎంపీల్యాడ్స్ నిధులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రతి సభ్యుడికి సంవత్సరానికి రూ.5 కోట్లు కేటాయిస్తారు. కానీ మన ఎంపీలు అందుబాటులో ఉన్న నిధుల్ని సరిగ్గా వినియోగించుకోవడం లేదు. 16వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యులకు కేటాయించిన ఎంపీల్యాడ్స్ నిధుల్లో రూ.1600కోట్లు వినియోగం కాలేదని కేంద్ర సహాయమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ వెల్లడించడం చర్చకు దారితీస్తోంది. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ఏం పనులు చేయాలో కూడా సక్రమంగా ప్లాన్ చేయడం లేదు. జిల్లా నోడల్ అధికారుల నుంచి పనులకు సంబంధించిన నివేదికలు తమకు అందలేదని అందుకే నిధుల విడుదలకు ఆలస్యమైందని కేంద్రమంత్రి చెబుతున్నారు. 16వ లోక్‌సభలోని పార్లమెంటు సభ్యులకు ఎంపీల్యాడ్స్ నిధుల కింద మొత్తం రూ.11,525 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది జులై 4వ తేదీ వరకు రూ.1641.98 కోట్లు వినియోగం కాలేదు. నియోజకవర్గాల్లో తాగునీరు, రోడ్లు, ఆస్పత్రులు, కమ్యూనిటీ భవనాలు, విద్యాసౌకర్యాలు లాంటివి కల్పించవచ్చు. కానీ మన ఎంపీలు తమకు విడుదలయ్యే నిధులను సరిగా ఖర్చుపెట్టలేకపోవడం వారి నిర్లిప్తతకు నిదర్శనంగా చెబుతున్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
12 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
13 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
13 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
17 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
18 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
16 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
18 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
19 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
14 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
21 hours ago
ఇంకా