newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎంతపని చేశావు సింధియా... రాహుల్, సచిన్ పైలట్ విచారం

12-03-202012-03-2020 09:10:49 IST
Updated On 12-03-2020 11:14:48 ISTUpdated On 12-03-20202020-03-12T03:40:49.720Z12-03-2020 2020-03-12T03:40:45.472Z - 2020-03-12T05:44:48.677Z - 12-03-2020

ఎంతపని చేశావు సింధియా... రాహుల్, సచిన్ పైలట్ విచారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ నేతలు తీరిగ్గా స్పందించడం మొదలెట్టారు. సింధియాకు తాను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి గౌరవించానని రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేయగా, సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లడం దురదృష్టకరం అంటూ రాజస్తాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. ఇతర కాంగ్రెస్ నేతలు తలో వ్యాఖ్యానం చేసి సింధియా రాజీనామాపై విమర్సలు మొదలెట్టేశారు. 

కానీ రాహుల్ గాంధీ మాత్రం సింధియా నిష్క్రమణను జీర్ణం చేసుకోనట్లుంది. ఏ సమయంలోనైనా తమ ఇంట్లోకి వచ్చే స్వాతంత్ర్యం సింధియాకు ఉందంటూ రాహుల్ భావోద్వగంతో వ్యాఖ్యానించారు. 2018 డిసెంబర్లో పెట్టిన ఓ పోస్టును ఈ సందర్భంగా రాహుల్ రీట్వీట్ చేశారు. లియో టాల్‌స్టాయ్ రాసిన ఓ ప్రముఖ సూక్తితో పాటు సీఎం కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా రాహుల్ గాంధీకి చెరోవైపు నిలబడిన ఓ ఫోటో కూడా ఇందులో ఉంది. ‘‘సమయం, సహనం అనే రెండే అత్యంత శక్తివంతమైన పోరాట యోధులు..’’ అంటూ 2018 డిసెంబర్ 13న రాహుల్ గాంధీ ఈ పోస్టు పెట్టారు.

కానీ ఆ పోస్టు పెట్టినప్పటి నుంచి ఈ  15 నెలల కాలంలో పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో సహనం కోల్పోయిన సింధియా... పార్టీతో తన 18 ఏళ్ల అనుబంధాన్ని తుంచేసుకున్నారు. దానికి బలమైన కారణం ఉంది కూడా. ఏప్రిల్ 2018లో మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన కమల్ నాథ్... అదే ఏడాది డిసెంబర్లో పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు మాత్రం వదల్లేదు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ... పార్టీ అధ్యక్ష పదవికి ఒక్క పేరు కూడా ఖరారు చేయలేకపోయింది. 

ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందున కనీసం పార్టీ అధ్యక్ష పదవి అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్న సింధియా మద్దతుదారులకు అధిష్టానం తీరు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కాగా తాను పార్టీ మారే ముందు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసేందుకు ప్రయత్నించినా తనకు సమయం ఇవ్వలేదంటూ సింధియా పేర్కొన్న కొద్ది గంటలకే రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించడం గమనార్హం. సింధియా రాజీనామా అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఏ సమయంలోనైనా మా ఇంట్లోకి రాగలిగిన కుర్రాడు ఎవరైనా ఉంటే అది సింధియా మాత్రమే..’’ అని పేర్కొన్నారు.

కాగా, జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరడంపై రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ తొలిసారి స్పందించారు. ఏవైనా సమస్యలు ఉంటే తామే కూర్చుని పరిష్కరించుకునే వాళ్లమనీ.. కానీ ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.  ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లడం దురదృష్టకరం.  ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే పార్టీలో చర్చించి పరిష్కరించుకుంటే బాగుండేది...’’ అని సచిన్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ సచిన్ పైలట్ కాగా సింధియా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడంతో ఇప్పుడు అందరి కళ్లూ రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ వైపు మళ్లిన సంగతి తెలిసిందే. గత కొద్ది నెలలుగా సీఎం అశోక్ గెహ్లాట్‌, సచిన్  పైలట్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తుండడమే దీనికి కారణం. కాగా నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కొందరు ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేయడంతో మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారు సంక్షోభంలో పడింది. 

కానీ 2018 రాహుల్ గాంధీ ఆ ట్వీట్‌ను ఎందుకు పెట్టారో, ఇప్పుడు దాన్నే మళ్లీ ఎందుకు రీట్వీట్ చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ఆ ట్వీట్ ప్రభావంవల్లో ఏమో కానీ గత 15 నెలలుగా అత్యంత సహనం ప్రదర్సిస్తూ వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా తాను సహనం కోల్పోయానని చెబుతూ పార్టీకీ రాజీనామా చేయడం గమనార్హం.

Image result for Patience & time: Rahul Gandhi retweets 2018 photo with Jyotiraditya Scindia, Kamal Nath. The question is why?

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   16 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle