newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉల్లి ఘాటు బీజేపీకేం కొత్త కాదు..!

30-09-201930-09-2019 12:06:14 IST
2019-09-30T06:36:14.600Z30-09-2019 2019-09-30T06:36:10.610Z - - 11-04-2021

ఉల్లి ఘాటు బీజేపీకేం కొత్త కాదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉల్లి ఘాటు కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఉల్లి ధర పెరిగితే ఏం  జరుగుతుందో బీజేపీకి బాగా తెలుసు. ఒక సారి  హస్తిన ఎన్నికలలో పరాజయానికి ఉల్లి ధరల పెరుగుదలే కారణం. ఇప్పుడు కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉల్లి ధరల పెరుగుదల ఆ  పార్టీని తీవ్రంగా వేధిస్తున్నది. 1998లో ఢిల్లీ  అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయానికి ‘ఉల్లి’ ఘాటు కారణమైంది. ఇప్పుడు ‘మహా’ అదే ఘాటు దెబ్బతీస్తుందన్న ఆందోళన బీజేపీని వెన్నాడుతోంది.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సమయంలో ఉల్లి ధరలను అదుపు చేయకపోతే ఆ ప్రభావం ఫలితాలపై చూపుతుందన్న భావన పార్టీలో వ్యక్తమౌతున్నది. ధరల అదుపునకు, ఉల్లి అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు కేంద్రం నడుంబిగించడానికి  కారణం  అదే.  అలాగే మార్కెటింగ్ ఫెడరేషన్,  మదర్ డైరీల ద్వారా ఉల్లిని తక్కువ ధరకే ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లూ చేస్తోంది. మహారాష్ట్రలోనూ, హర్యానాలోనూ అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కనుక ఉల్లి ధరల పెరుగుదల ప్రభావం అత్యధికంగా బీజేపీపైనే చూపుతుందన్నది పార్టీ ఆందోళన.

ఉల్లి ధరల ప్రభావం సామాన్యుడి ఆగ్రహానికి కారణమౌతుందన్నసంగతి మరే ఇతర పార్టీల కంటే బీజేపీకే బాగా తెలుసు. దేశ వ్యాప్తంగా పార్టీకీ, కేంద్రంలోని మోడీ సర్కార్ కు సానుకూలత వ్యక్తమౌతున్న ఈ తరుణంలో ఉల్లి దెబ్బ పడుతుందన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలో పరిస్థితిని ఏదో మేరకు అదుపు చేసేందుకు ఎగుమతులపై నిషేధం విధించింది. దీని వల్ల ఉల్లి ధరలు దిగివస్తాయన్నది కేంద్రం భావన.

ఇప్పుడు ఉల్లి ధరలు ఇంతగా పెరిగిపోవడానికి కారణం నిల్వలు లేక కాదనీ, వరదల కారణంగా రవాణా సమస్యలు తలెత్తడమేనని కేంద్రం చెబుతున్నది. అయితే ఆ వివరణ ప్రజలను సంతృప్తి పరుస్తుందని కానీ, సమాధాన పరుస్తుందని కానీ కేంద్రానికి నమ్మకం కుదరడం లేదు. ఉల్లి ఎగుమతులకు కీలకమైన మహారాష్ట్ర,  బీహార్, గుజరాత్, మధ్య ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో వరదల కారణంగా ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది.   దీనికి తోడు వరదల కారణంగా రవాణా సమస్యలు..నిల్వలు ఉన్నా సరుకునే చేరవేయలేకపోతున్నమన్న కేంద్రం వివరణ...ముందు చూపులేమినే సూచిస్తుంది తప్ప ప్రజలను సమాధాన పరచలేదు.

ఇప్పటికిప్పుడు ధరలకు కళ్లెం వేస్తే తప్ప ప్రజాగ్రహం నుంచి తప్పించుకోలేమని కేంద్రానికి తెలుసు. తక్కువ ధరలకు ఉల్లిని ప్రజలకు అందజేయడానికి చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాన్నివ్వడం లేదు. ఎగుమతుల నిషేధం, తక్కువ ధరలకే ఉల్లి సరఫరా వంచి ఉపశమన చర్యలు పెద్దగా ఫలితాన్ని ఇచ్చే అవకాశం లేదు.  ఎందుకంటే నిషేధం తక్షణమే అమలులోనికి వచ్చినా...మార్కెట్లో ఉల్లి ధరల పెరుగుదల ఆగడానికి కొంత సమయం పడుతుంది. తక్కువ ధరకు ఉల్లిని నేరుగా కేంద్రమే సరఫరా చేస్తున్నా...ఆ సరఫరా ప్రజావసరాలకు సరిపడేంతగా లేదు.

ఉల్లి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయంటూ చెబుతున్న ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 16వేల టన్నులను విడుదల చేసింది. మొత్తం నిల్వలు 56వేల టన్నలు కాగా వాటిలో 16వేల టన్నులను విడుదల చేసింది. ధరల నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెబుతోంది. ఎగుమతి నిషేధం, మార్కెట్ సొసైటీలు, మదర్ డైరీ ద్వారా చౌకగా ఉల్లిని వినియోగదారులకు అందించడం ద్వారా ప్రభుత్వం ఉల్లి విషయంలో ప్రజల డిమాండ్ నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నదన్న భావన కలుగుతుందన్నది కేంద్రం ఆశ. మొత్తం మీద ఉల్లి ప్రభావం ఎన్నికలపై పడకుండా ఉండేందుకు కేంద్రం శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   11 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle