newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉరి వాయిదాకి సకల యత్నాలు. నిర్భయ దోషుల మరో పిటిషన్

25-01-202025-01-2020 08:21:13 IST
Updated On 25-01-2020 13:30:23 ISTUpdated On 25-01-20202020-01-25T02:51:13.880Z25-01-2020 2020-01-25T02:50:47.017Z - 2020-01-25T08:00:23.876Z - 25-01-2020

ఉరి వాయిదాకి సకల యత్నాలు. నిర్భయ దోషుల మరో పిటిషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిర్భయ దోషులకు మరో వారంలో ఉరి శిక్ష అమలుకావాల్సి వుంది. అయితే నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డెత్ వారెంట్ నుంచి తప్పించుకునేందుకు దొరికిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటూ కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. దీంతో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నిందితులు పవన్, అక్షయ్ మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. వీరిద్దరి తరపున న్యాయవాది ఏపీ సింగ్ ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశారు. 

దోషులు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను ఇచ్చేందుకు తీహార్ జైలు అధికారులు జాప్యం చేశారని న్యాయవాది పిటిషన్‌లో ఆరోపించారు. దీంతో క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేందుకు ఆలస్యమైందని న్యాయవాది అంటున్నారు. గతంలో ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు వీరికి మొదటి డెత్ వారెంట్ జారీ చేసింది. దానిపై దోషులు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేస్తూ సమయం గడిచిపోయింది. 

ఇంకోసారి ఫిబ్రవరి1న ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి నిందితులు కోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటీషన్‌పై పటియాల కోర్టు శనివారం విచారణ చేపట్టనుంది. ఈనేపథ్యంలో మరోసారి ఉరి వాయిదా పడుతుందా? పాత డెత్ వారెంట్ ప్రకారమే ఉరి అమలుచేస్తారేమో చూడాలి. తాజా పరిణామాలపై నిర్భయ తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి : నిర్భయ దోషుల ఉరికి ఏర్పాట్లు


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle