newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉమర్ ఖలీద్‌ 10 రోజుల పోలీసు కస్టడీ.. ఇంకెన్ని నిజాలు బయటకు రానున్నాయో..!

15-09-202015-09-2020 06:52:28 IST
2020-09-15T01:22:28.758Z15-09-2020 2020-09-15T01:22:25.213Z - - 17-04-2021

ఉమర్ ఖలీద్‌ 10 రోజుల పోలీసు కస్టడీ.. ఇంకెన్ని నిజాలు బయటకు రానున్నాయో..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ విద్యార్థి నేత, కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సుదీర్ఘంగా ఉమర్ ఖలీద్‌ను పోలీసులు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఖలీద్ ఫ్యామిలీకి సమాచారం అందించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసన నేపథ్యంలో జరిగిన అల్లర్ల కేసులో ఖలీద్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. .

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 24వ తేదీన ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఘర్షణలో 50 మందికి పైగా చనిపోగా.. 108 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఏ ఒక్కరీ పాత్రపై లోతుగా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ద్వేషం పెంచి, గొడవకు కారణమైన వారిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కేసుకు సంబంధించి మరికొందరిని కూడా అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతిఘోష్‌, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫశ్రీసర్‌ అపూర్వానంద్‌, స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ రాహుల్‌రాయ్‌లపై ఇంతకు ముందే ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షిట్‌ దాఖలు చేశారు. వీరితో పాటు భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే మతీన్‌ అహ్మద్‌, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్‌ వంటి నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దేశ వ్యతిరేక కుట్ర పేరుతో ఏచూరి పేరును ఇరికించడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుపట్టడంతో పోలీసులు చార్జ్‌షిట్‌లో ఏచూరి పేరు లేదని తెలిపారు.

ఉమర్ ఖలీద్ ను 10 రోజుల పాటూ తమ కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో పోలీసులు అతడిని సబ్మిట్ చేశారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా భావిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం -ఉపా కింద ఉమర్‌ ఖలీద్‌ను అరెస్ట్‌ చేసినట్టు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆప్ నుంచి సస్పెండయిన తాహీర్ హుస్సేన్.. ఉమర్ ఖలీద్‌, ఖలీద్ సఫీని కలిశాడని చార్జీషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. జనవరిలో షహీన్ బాగ్ వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన నేపథ్యంలో పెద్ద ఘటన చేయాలని వీరి ప్లాన్ అని చెబుతున్నారు పోలీసులు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   13 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   17 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   19 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle