newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉన్నావ్ దోషులకు శిక్ష పడుతుందా?

16-12-201916-12-2019 09:15:25 IST
Updated On 16-12-2019 16:24:05 ISTUpdated On 16-12-20192019-12-16T03:45:25.050Z16-12-2019 2019-12-16T03:45:02.061Z - 2019-12-16T10:54:05.212Z - 16-12-2019

ఉన్నావ్ దోషులకు శిక్ష పడుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యూపీలో సంచలనం కలిగించింది ఉన్నావ్ అత్యాచారం కేసు. ఈ ఘోరానికి పాల్పడిన వారికి వెంటనే శిక్ష విధించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఉన్నావ్‌ అత్యాచారం కేసులో బాధితురాలు కూడా ఇటీవల అగంతకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. తన కూతురు మరణించిందని, ఇప్పటికైనా దోషులకు కఠిన శిక్ష విధించాలని. శిక్ష అమలులో కాలయాపన లేకుండా చూడాలని ఉన్నావ్ బాధితురాలి బంధువులు కోరుతున్నారు.

ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. తీర్పు ఎలా వుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారని బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ జరిగింది. 

ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్‌ శర్మ 16వ తేదీన తీర్పు ఇవ్వనున్నారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు ఇచ్చే అవకాశముందరు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్‌ శర్మ ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టారు.

కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది. సుప్రీంకోర్టు చొరవతో లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. ఈ కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్ తో  పాటు శశిసింగ్ కూడా ఆరోపణలున్నాయి.

కేసులో ఆరోపణలతో కుల్దీప్ సింగ్ ని బీజేపీ బహిష్కరించింది. నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్‌ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఆ ఇద్దరిపైన కేసులు నమోదయ్యాయి. నిందితులపై ఛార్జిషీట్ కు ముందే బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. 

ఆమె ప్రయాణిస్తున్న కారుని ట్రాక్టర్‌ ఢీకొనడంతో బాధితురాలి సన్నిహిత బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు.  ఆగస్టు ఒకటిన ఈ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. విచారణ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేయాలంటూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఢిల్లీ కోర్టు ఉన్నావ్ కేసుపై ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

 

 

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   20 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle