newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘ఉన్నావ్‘ తీర్పు... కుల్దీప్ సెంగార్‌కి యావజ్జీవ శిక్ష

20-12-201920-12-2019 15:06:40 IST
2019-12-20T09:36:40.991Z20-12-2019 2019-12-20T09:36:39.462Z - - 15-04-2021

‘ఉన్నావ్‘ తీర్పు... కుల్దీప్ సెంగార్‌కి యావజ్జీవ శిక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు శిక్షను ఖరారు చేసింది తీస్‌హజారీ కోర్టు. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దిశ కేసు తర్వాత ఉన్నావ్ నిందితుడికి శిక్ష విధించాలని దేశమంతా డిమాండ్లు వచ్చాయి. దీంతో న్యాయవిచారణ పూర్తి చేసిన పోలీసులు కోర్టులో అన్ని సాక్ష్యాధారాలు అందచేశారు.

దీంతో తీస్ హజారీ కోర్టు ఇవాళ శిక్షను ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కుల్దీప్ సెంగార్ బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నాలుగు రోజుల క్రితం ఈ కేసులో కుల్దీప్ సెంగార్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన కోర్టు శుక్రవారం శిక్ష విధిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే.

ఉన్నావ్‌లో 2017 సంవత్సరంలో ఓ మైనర్ బాలిక  ఉద్యోగం కోసం స్థానిక ఎమ్మెల్యే  కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ ఇంటికి వెళ్థింది. అయితే ఎమ్మెల్యే ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కూడా కొందరు వ్యక్తలు ఆమెను కిడ్నాప్ చేసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే తన అనుచరుల సహకారంతో బాధితురాలి కుటుంబంపై దాడిచేశారు.

బాధితురాలి తండ్రిని తీవ్రంగా గాయపరిచి అక్రమ ఆయుధాల కేసును పెట్టి అరెస్ట్ చేయించడం సంచలనం రేపింది. ఉన్నావ్ బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలోనే చనిపోయాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం ఇంటి ముందే ఆత్మహత్యా యత్నం చేసింది. ఉన్నావ్ బాధితురాలి వత్తిడి, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల నిరసనలతో కేసు సీబీఐకి బదిలీ చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్‌ సింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. అయినా అతని నుంచి బాధితురాలు ఇబ్బందులు పడింది. ఆమె కారులో ప్రయాణిస్తుండగా లారీతో ఢీకొట్టించారు. ఈ ప్రమాదంలో ఆమె బంధువులు ఇద్దరు చనిపోగా, బాధితురాలు పక్షాన వాదనలు వినిపిస్తోన్న న్యాయవాది గాయపడ్డారు. కేసుపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం ఐపీసీ సెక్షన్‌ 376 (అత్యాచారం) కింద ఎమ్మెల్యే కుల్దీప్ నేరం చేసినట్టు నిర్దారించింది.

ఈ తీర్పు కోసం బాధితురాలి బంధువులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే బాధితురాలు ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ నిర్వహించారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెల్లడించింది. అయితే సీబీఐ తీరుని కోర్టు ఆక్షేపించింది. తాజాగా నిందితుడికి జీవిత ఖైదు విధించడంపై ఉన్నావ్ బాధితురాలి బంధువులు ఏమంటారో చూడాలి. 

 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle