newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

ఉన్నావ్‌లో సాక్షి మహరాజ్ హవా కొనసాగుతుందా?

29-04-201929-04-2019 14:37:38 IST
2019-04-29T09:07:38.400Z29-04-2019 2019-04-29T09:07:34.186Z - - 22-09-2020

ఉన్నావ్‌లో సాక్షి మహరాజ్ హవా కొనసాగుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్తర‌ప్రదేశ్ లోని ఉన్నావ్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి గ‌ట్టి పోటీ నెల‌కొంది. ఎందుకంటే ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ నేత సాక్షి మ‌హ‌రాజ్ మ‌రోసారి పోటీ చేస్తున్నారు. ప‌లు వివాదాస్పద వ్యాఖ్యల‌తో వార్తల్లో నిలిచిన సాక్షి మ‌హ‌రాజ్, ఈసారి టిక్కెట్ విష‌యంలో కూడా త‌న‌దైన శైలిలో స్పందించారు. త‌న‌కు ఉన్నావ్ టిక్కెట్ ఇవ్వక‌పోతే, ఈ సీటులో త‌న స‌త్తా ఏంటో చూపిస్తానంటూ ప్రక‌ట‌న చేశారు. 

దీంతో ఆయ‌న మాట‌ల‌కే త‌లొగ్గిన బీజేపీ అధిష్టానం మ‌రోసారి టిక్కెట్ కేటాయించింది. సాక్షి మ‌హ‌రాజ్‌ను మ‌రోసారి అభ్యర్థిగా నిల‌బెట్టడం వెనుక మ‌రో కార‌ణం కూడా ఉంది. ఉత్తర‌ప్రదేశ్ లోని ప‌లు ప్రాంతాల్లో ఆయ‌న‌కు ప‌లు ఆశ్రమాలు, పాఠ‌శాలలు, కాలేజీలు ఉన్నాయి. జనంలో కూడా మంచి పేరుంది. అతి త‌క్కువ ఫీజుల‌తో విద్య అందిస్తున్నార‌న్న అభిప్రాయం కూడా జ‌నంలో ఉంది. అందుకే ఆయ‌న‌కు మ‌రోసారి టిక్కెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ఈయన ఇమేజ్ పార్టీకి ప్లస్ అవుతుందని భావించింది. 

ఇక ఏప్రిల్ 29న జ‌రిగిన ఉన్నావ్ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నికల్లో సాక్షి మహ‌రాజ్ మీద స‌మాజ్ వాదీ పార్టీ నేత అరుణ్ శంక‌ర్ శుక్లా, కాంగ్రెస్ నేత అన్నా టాండ‌న్ పోటీలో ఉన్నారు. ఎన్నిక‌ల ప్రచారంలో కూడా సాక్షి మ‌హ‌రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశానికి ఇవే ఆఖ‌రు ఎన్నిక‌ల‌నీ, 2024 నుంచి ప్రజ‌లు బీజేపీని ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటార‌ని చెప్పారు.

అంతేకాదు, 2014లో మోడీ హ‌వా ఉంద‌నీ, ఇప్పుడు మోడీ సునామీలో అన్ని పార్టీలు కొట్టుకుపోతాయ‌ని అన్నారు. ఇక సాక్షి మ‌హ‌రాజ్ మీద 34 కేసులు ఉన్నాయ‌ట‌. ఇందులో నాలుగు క్రిమిన‌ల్ కేసులతో పాటు రాబ‌రీ, డెకాయిటీ, హ‌త్య‌, ఫోర్జ‌రీ, చీటింగ్, న‌మ్మ‌క‌ద్రోహం కేసులు ఉన్నాయ‌ట‌. అంతేకాదు, రెండు రేప్ కేసుల్లో ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తానికి ఈ ఎన్నిక‌ల్లో ఉన్నావ్ సీటు మ‌రోసారి హాట్ టాపిక్ అయింది.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle