newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉద్దవ్ థాకరే కీలక నిర్ణయం.. మంత్రివర్గ విస్తరణ

18-12-201918-12-2019 09:05:06 IST
Updated On 18-12-2019 10:34:03 ISTUpdated On 18-12-20192019-12-18T03:35:06.064Z18-12-2019 2019-12-18T03:34:55.934Z - 2019-12-18T05:04:03.583Z - 18-12-2019

ఉద్దవ్ థాకరే కీలక నిర్ణయం.. మంత్రివర్గ విస్తరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్దవ్ థాకరే తనదైన పాత్ర పోషిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గాన్ని విస్తరించలేదు. తాజాగా మంత్రివర్గ విస్తరణపై ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన మూడు పార్టీల నుంచి ఆరుగురు చొప్పున ప్రమాణం చేయనున్నారు. 

మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ ఈ నెల 23న జరిగే అవకాశాలున్నాయి.  నవంబర్‌ 28వ తేదీన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రేతోపాటు మూడు పార్టీలకు చెందిన ఏక్‌నాథ్‌ షిండే, సుభాస్‌ దేశాయ్, ఛగన్‌ భుజబల్, జయంత్‌ పాటిల్, బాలాసాహెబ్‌ థోరాత్, నితిన్‌ రావుత్‌ ఇలా ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత నాగ్‌పూర్‌లో సోమవారం నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన ఆ ఆరుగురు మంత్రులకు ఈ నెల 12వ తేదీన తాత్కాలికంగా పలు శాఖల బాధ్యతలు కట్టబెట్టారు.

 ఈ నెల 23 లేదా 24వ తేదీన జరిగే మొదటి మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శివసేన 10 మంది ఎమ్మెల్యేల పేర్లు, కాంగ్రెస్‌ 9 మంది, ఎన్సీపీ 8 ఇలా మొత్తం 27 మంది ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితా రూపొందించాయని తెలుస్తోంది. 

18 మంత్రిపదవుల్లో ఎవరిని అదృష్టం వరిస్తుందో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలున్న ఎమ్మెల్యేలు రాందాస్‌ కదం, అనీల్‌ పరబ్, సునీల్‌ ప్రభు, దీపక్‌ కేసర్కర్, ఉదయ్‌ సామంత్, తానాజీ సావంత్, గులాబ్‌రావ్‌ పాటిల్, ఆశీష్‌ జైస్వాల్, సంజయ్‌ రాఠోడ్, సుహాస్‌ కాందేల పేర్లు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ నుంచి అశోక్‌ చవాన్, పృథ్వీరాజ్‌ చవాన్, విజయ్‌ వడెట్టివార్, వర్షా గైక్వాడ్, యశోమతి ఠాకూర్, సునీల్‌ కేదార్, సతేజ్‌ పాటిల్, కే.సి.పాడ్వీ, విశ్వజీత్‌ కదం. ఎన్సీపీ నుంచి అజిత్‌ పవార్, దిలీప్‌ వల్సే పాటిల్, ధనంజయ్‌ ముండే, హసన్‌ ముశ్రీఫ్, నవాబ్‌ మలిక్, రాజేశ్‌ టోపే, అనీల్‌ దేశ్‌ముఖ్, జితేంద్ర అవ్హాడ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. 

తొలి మంత్రివర్గ విస్తరణ పూర్తయితే పాలనపై మరింత పట్టు బిగించవచ్చని భావిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీకి పోటీచేయడానికి ఉద్దవ్ థాకరే ఆలోచిస్తున్నారు. ఆరునెలలోపు ఆయన ఏదో ఒక స్థానం నుంచి ఎన్నిక కావలసి వుంది. 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   7 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle