newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉత్కంఠ రేపుతున్న ‘మహా’ పరిణామాలు.. సీఎంగా ఉద్ధవ్!

22-11-201922-11-2019 09:12:39 IST
2019-11-22T03:42:39.522Z22-11-2019 2019-11-22T03:40:39.482Z - - 10-04-2021

ఉత్కంఠ రేపుతున్న ‘మహా’ పరిణామాలు.. సీఎంగా ఉద్ధవ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో కొనసాగుతున్న ప్రతిష్టంభన త్వరలో ముగియనుంది. ప్రభుత్వ ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చేలా కనినిస్తోంది.. సంకీర్ణ సర్కార్ ఏర్పాటు విధివిధానాలపై చర్చించేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు భేటీ అయ్యాయి. ఈ నేపథ్యంలో  తదుపరి సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ సంకీర్ణంలోని ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి? ఎవరు ఏ పదవులు తీసుకోవాలి? అనే కీలకాంశాలను ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. 

ప్రభుత్వంలోని మంత్రి పదవుల్లో తమకు సమాన వాటా ఉండాలని కాంగ్రెస్ కోరినట్టు సమాచారం. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మూడు పార్టీలకు 14-14-14 చొప్పున మంత్రి పదవులు ఉండాలని కాంగ్రెస్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. వీటికి శివసేన కూడా అంగీకారం తెలిపిందని అంటున్నారు.

శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ కూటమికి ‘మహా వికాస్‌ అఘడి’ అని పేరు నిర్ణయించారు.

మూడు పార్టీల మధ్య పదవుల పంపకానికి సంబంధించి అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎన్‌సిపి, కాంగ్రెస్‌ పార్టీలనుంచి ఒక్కొక్కరికి ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది.  ఎన్‌సిపికి చెందిన అజిత్‌ పవార్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బాలాసాహెబ్‌ థొరాట్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ 105,శివసేన56 సీట్లు గెలుచుకున్నాయి. ఇక ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు గెలుచుకున్నాయి. ముఖ్యమంత్రి పదవిపై శివసేన ప్రతిపాదించిన 50-50 ఫార్ములా కు బీజేపీ ఒప్పుకోలేదు.

దీంతో ఇరు పార్టీలు కటీఫ్ చెప్పుకున్నాయి. దాంతో శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నాయి. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను గవర్నర్ ఆహ్వానించే టైం కోసం ఈ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. 

మరోవైపు సంకీర్ణ ప్రయత్నాలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లినట్లేనని ఆ పార్టీ నాయకుడు సంజయ్‌ నిరుపమ్‌ కామెంట్ చేశారు.

పొత్తు విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆయన హెచ్చరించడంతో రాజకీయాలు వేడెక్కాయి.ఉత్తర్‌ ప్రదేశ్‌లో గతంలో బిఎస్‌పితో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్‌ బాగా దెబ్బతిన్నదని సంజయ్ నిరుపమ్ అన్నారు.

త్వరలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పడే సూచనలు వచ్చిన వేళ కాంగ్రెస్ నేతల విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇవాళ జరిగే  కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.  

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   an hour ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle