newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ఉగ్ర చెరనుంచి కాశ్మీర్ కు విముక్తి...!

09-08-201909-08-2019 16:08:22 IST
2019-08-09T10:38:22.023Z09-08-2019 2019-08-09T10:36:53.025Z - - 16-11-2019

ఉగ్ర చెరనుంచి కాశ్మీర్ కు విముక్తి...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

జమ్మూ కాశ్మీర్..భూతల స్వర్గం లాంటి ఆ రాష్ట్రం గత కొన్ని దశాబ్దులుగా ఉగ్రమూకల రాక్షస రాజ్యంగా మారిపోయింది. అందుకు ఆర్టికల్ 370, 35ఎ దోహదం చేశాయన్నది నిర్వవాదాంశం. అయితే వాటిని మోడీ సర్కార్ రద్దు చేయడంతో పరిస్థితులలో మార్పు వస్తుందన్న ఆశ లేశమాత్రంగానైనా భారతీయులలో కనిపిస్తున్నది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా తన ప్రభుత్వ నిర్ణయం చారిత్రకంగా అభివర్ణించారు. నరేంద్ర మోడీ సమర్ధన కంటే ముందుగానే దేశంలో మెజారిటీ ప్రజలు జమ్మూ కాశ్మీర్ విషయంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేయడంతో పాటు హర్షామోదాలు సైతం వ్యక్తం చేశారు. జమ్మా కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో ఇక నవయుగం మొదలౌతుందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతున్నది. పాకిస్థాన్, చైనా మినహాయిస్తే ప్రపంచ దేశాలు కూడా భారత ప్రభుత్వ నిర్ణయం ఆ దేశ అంతర్గత వ్యవహారంగానే భావిస్తున్నట్లు ప్రకటించేశాయి. దీంతో ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చి భారత్ ను ఇరుకున పెట్టాలన్న పాకిస్థాన్ పాచిక పారలేదు. 

ఏడు దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే కాకుండా, ఆ రాష్ట్ర, రాష్ట్ర ప్రజల భివిష్యత్ చిత్రపటం ఒక మహోజ్వలంగా ఉండేందుకు ఇది దోహదపడుతుందన్న ఆశాభావం జనంలో వ్యక్తమౌతున్నది. అదే దిశగా ప్రజలలో ఆశలను, భవిష్యత్ పట్ల నమ్మకాన్ని పాదుకొల్పేందుకు వీలుగానే ప్రధాని నరేంద్ర మోడీ ఆకాశవాణి ద్వారా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఉంది. భూతల స్వర్గం వంటి జమ్మూ కాశ్మీర్ భూతాల (ఉగ్ర భూతాల)కు నిలయంగా మారడానికి దశాబ్దాలుగా పాలకులు అనుసరించిన ఉదార వైఖరే కారణం. ఓటు బ్యాంకు రాజకీయాలైతేనేమి? మత వ్యవహారమైతేనేమి? ఇప్పటి వరకూ కాశ్మీర్ విషయంలో పార్టీలన్నీ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రజలలో కాశ్మీర్ లో శాంతి నెలకొంటుందన్న ఆశ రేకెత్తించే విధంగా మోడీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పడం, అలాగే దేశ ప్రజలకు ఆర్టికల్ 370 రద్దు ఆవశ్యకతను వివరించడం ధ్యేయంగా ప్రధాని మోడీ ఆకాశవాణి ద్వారా జాతి నుద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని అన్ని అంశాలూ గత మూడు నాలుగు రోజులుగా జనం నోళ్లలో నానుతున్నవే. అదే సమయంలో ఇంత కాలం కాశ్మీర్ ప్రజలు ఏవో ప్రత్యేక హక్కులను అనుభవిస్తున్నారనీ, వారు దేశంలోని ఇతర ప్రజల కంటే అధికంగా అంటే మొదటి తరగతి పౌరులుగా పరిగణింపబడుతున్నారనీ సామాన్య జనంలో ఉన్న అపోహలు తొలగిపోవడానికి కూడా మోడీ తన ప్రసంగంలో ప్రయత్నం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంటే ఉగ్ర హింస, నిత్య నరకం, ఎప్పుడేం జరుగుతుందో అర్ధం కాని టెన్షన్. ఇంత కాలంగా జమ్మూకాశ్మీర్ ప్రజలు అనుభవించిన జీవితం. దాదాపు గంట సేపు మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

  గత ఏడు దశాబ్దాలుగా జనం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. అందుకు కారణాలను వివరించారు. అదే సమయంలో భవిష్యత్ పై భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు. ఆర్టికల్ 370 కాశ్మీర్ కు ఎటువంటి ప్రయోజనం కలిగించకపోగా... వేర్పాటు వాదం, ఉగ్రహింసాకాండలతో పాటు అవినీతి పేరుకుపోవడానికి మాత్రమే కారణమైంది. ఇవి కాకుండా కాశ్మీర్ కు ఆర్టికల్ 370, 35ఎ ద్వారా కలిగిన లాభమేమిటన్నది మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పిలుపునిస్తున్నవారు, విమర్శలు గుప్పిస్తున్న వారు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఆ రెంటినీ రద్దు చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటో చెప్పారు. అయితే ప్రధాని మోడీ జాతినుద్దేశించి చెసిన ప్రసంగంతో సంబంధం లేకుండానే...కాశ్మీర్ సహా దేశం మొత్తం ఆ ప్రయోజనాలు చేకూరుతాయన్న చర్చ చేసింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో సమానంగా కాశ్మీర్ లో కూడా వ్యాపార వాణిజ్య పురోగతి కనిపిస్తుందన్న భావన ఆ రాష్ట్ర ప్రజలతో ఇతర రాష్ట్రాల ప్రజలలోనూ వ్యక్తమైంది. ఆ పురోభివృద్ధికి 370 రద్దుతో రాచబాట పడిందన్న భరోసాను ప్రధాని మోడీ నిన్నటి ప్రసంగంలో ఇచ్చారు. 

ఇంత కాలం 370 ఆర్టికల్ కాశ్మీర్ కు చేసిందేమైనా ఉంటే అక్కడి యువతకు ఉపాధి దూరం చేయడంతో పాటు...ఉపాధి లేమి ఆసరాగా...యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా వేర్పాటు వాదుల సహకారంతో దాయాది దేశం వారిని ప్రలోభాలకు గురి చేయడానికి ఉపయోగపడింది. భద్రతా చర్యల కోసం శ్రమిస్తున్న భారత జవాన్లపైకి రాళ్లు రువ్వడం ఒక యువతకు ఒక ఆదాయవనరుగా మార్చేందుకు దేశ వ్యతిరేకులు చేసే ప్రయత్నాలు ఫలవంతం కావడానికి దోహదపడింది. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుతో అటువంటి అరాచక వ్యవహారాలు తెరపడుంది. యువతకు దేశంలోని ఇతర రాష్ట్రాల యువతతో పాటు సమాన హక్కులు దఖలు పడతాయన్న నమ్మకం కుదిరింది. గతం నిశీధి, వర్తమానం హింస, భవిష్యత్తెలా అన్న బెంగ నుంచి కాశ్మీరీలు బయటపడటానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడింది. గతం సంగతి వదిలేస్తే  వర్తమానంలో హింసకు తావులేని కాశ్మీర్ సాక్షాత్కారం అవుతుందన్న నమ్మిక ఏర్పడింది. అంతే కాదు భవిష్యత్ బంగారు బాట అన్న ఆశ కలిగింది. అందుకు తార్కానమే ఆర్టికల్ 370 రద్దు తరువాత రెండు రోజులలోనూ కాశ్మీర్లో ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. రద్దు నిర్ణయం వెలువడటానికి ముందు ఆంక్షలు విధిస్తూ తీసుకున్న చర్య ముందు జాగ్రత్త కోసమే తప్ప అక్కడ ప్రజల నుంచి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిఘటన వస్తుందన్న ఆందోళనతో కాదని గతమూడు రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితిని గమనిస్తే.. అవగతమౌతుంది. 

జాతీయ భద్రతా సలహాదారు.. అజిత్ దోవల్ జమ్మూ కాశ్మీర్ లో జనం మధ్య తిరుగుతూ వారితో మమేకమైన దృశ్యాలు రాష్ట్రంలో రోజుల వ్యవధిలోనే మారిన పరిస్థితికి అద్దం పట్టాయి. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులంతా ప్రజల నివాసాలకు వెళ్లి వారి యోగక్షేమాలు కనుక్కోవాలంటూ జారీ చేసిన ఆదేశాలు జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి వేగంగా సాధారణ స్థితికి వస్తున్నదనడానకి తార్కానం. జనం ఏ జరుగుతుందని జనం ఆశిస్తున్నారో...ఏం కావాలని జనం కోరుకుంటున్నారో...అదే చేయబోతున్నామని ప్రధాని మోడీ తన ప్రసంగంలో భరోసా ఇచ్చారు. ఔను మోడీ భరోసాతో జమ్మూ కాశ్మీర్ పునర్వైభవం సంతరించుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదన్న విశ్వాసం ప్రజలలో కలిగిందనడానికి సందేహం అవసరం లేదు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle