newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ షాక్‌లు చాలా.... ఇంకా కావాలా?

02-01-202002-01-2020 09:33:43 IST
2020-01-02T04:03:43.131Z02-01-2020 2020-01-02T04:03:36.650Z - - 11-04-2021

ఈ షాక్‌లు చాలా.... ఇంకా కావాలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొత్త ఏడాదికి ముందే కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ లు ఇచ్చింది. నిత్యం వంటగదుల్లో ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధర పెంచి షాకిచ్చిన కేంద్రం.. మరో సారి తన నైజం చాటుకుంది. కొత్త ఏడాదిలో రైల్వే ప్రయాణీకులకు రైల్వే శాఖ చేదువార్త వినిపించింది.

రైల్వే ఛార్జీలను స్వల్పంగా పెంచింది. పెంచిన ఛార్జీలు జనవరి  అర్ధరాత్రి అమల్లోకి రానున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే పెరిగిన ఛార్జీలు సబర్బన్ ప్రాంతానికి, సీజన్ టికెట్లకు వర్తించవని వెల్లడించింది. 

రైల్వే ప్రయాణాన్ని కోట్లాది మంది ఉపయోగించుకుంటున్నారు. అయినా, కేంద్రం ఆదాయం కోసం ప్రయాణికులపై భారం మోపుతూనే వుంది. పెంచిన రైల్వే ఛార్జీలతో భారం పడనుంది. ఆర్డినరీ నాన్-ఏసీ (నాన్- సబర్బన్)లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ ల కు కిలోమీటర్ కు ఒక పైస చొప్పున, మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ (నాన్-ఏసీ)లో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లకు కిలోమీటర్ కు రెండు పైసల చొప్పున పెంచింది.

ఏసీ క్లాసెస్ కు సంబంధించి.. ఏసీ చైర్ కార్, ఏసీ-3 టైర్/ 3-టైర్ ఎకానమీ, ఏసీ-2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ చైర్ లకు నాలుగు పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

ఈ పెంచిన ఛార్జీలు మాట అలా ఉంచితే.. కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. ఎల్పీజీ ధరలకు తోడు రైల్వే ఛార్జీలు కూడా పెరగడం, రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరగడంతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . ఏకంగా సిలిండర్ ధర 20 రూపాయల పైన పెరగడంతో భారం విపరీతంగా ఉంటుందంటున్నారు. గడచిన ఐదునెలల్లో సిలిండర్ ధర ఏకంగా రూ.140 పెరిగింది. త్వరలో రాబోయే బడ్జెట్లో కేంద్రం ఇంకెన్ని షాక్ లు ఇస్తుందో చూడాలి. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   12 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   15 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle