newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ మహిళా ఎంపీలు సమ్ థింగ్ స్పెషల్ -2

06-06-201906-06-2019 07:28:20 IST
Updated On 06-06-2019 14:58:54 ISTUpdated On 06-06-20192019-06-06T01:58:20.315Z06-06-2019 2019-06-06T01:58:16.501Z - 2019-06-06T09:28:54.145Z - 06-06-2019

ఈ మహిళా ఎంపీలు సమ్ థింగ్ స్పెషల్ -2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

(మొదటి భాగం తరువాయి)

ఇక ఒడిశాలోని కియోంఝ‌ర్ ఎంపీ సీటు నుంచి గెలిచిన చంద్రాణి మోర్ము వ‌య‌స్సు 25 సంవ‌త్స‌రాలు. పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో ఈమె చిన్న వ‌య‌స్కురాలు. భువ‌నేశ్వ‌ర్ ఐటీఈఆర్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన చంద్రాణి, ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్ఫింగ్ వీడియోతో ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నం జ‌రిగినా ఏమాత్రం జంక‌ని ఆమె, గ‌తంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన త‌న తాత‌ను ఆద‌ర్శంగా తీసుకున్నారు. గిరిజ‌న వ‌ర్గానికి చెందిన చంద్రాణి, త‌న ప్ర‌త్య‌ర్థి బీజేపీ ఎంపీ అనంత నాయ‌క్ మీద 66,203 ఓట్ల‌తో గెలిచారు. గిరిజ‌న పిల్ల‌లు బాగా చ‌దువుకోవాల‌న్న‌దే త‌న ఉద్దేశ‌మ‌ని చెబుతున్నారు చంద్రాణి. 

ఇక ఒడిశాలోని ఆస్కా ఎంపీ సీటు నుంచి గెలిచిన పరిమ‌ళ బిష్ణోయ్ విజ‌యం మ‌రీ విచిత్రంగా ఉంది. 70 ఏళ్ల వ‌య‌స్సున్న ప‌రిమ‌ళ‌, చ‌దువుకుంది మూడో త‌ర‌గ‌తి. గిరిజ‌న కుటుంబం కావ‌డంతో ఆమెకు బాల్య వివాహం అయింది. స్థానికంగా అంగ‌న్ వాడీ కేంద్రంలో స‌హాయ‌కురాలిగా ప‌నిచేస్తున్న ప‌రిమ‌ళ‌కు రాజ‌కీయాలంటే బాగా భ‌య‌ం. భ‌ర్త చిన్న‌పాటి ఉద్యోగి, పెద్ద కుమారుడు టీ స్టాల్ న‌డుపుతుంటే, చిన్న కుమారుడు టూ వీల‌ర్ మెకానిక్. బాగా చ‌దువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాల‌ని ఎప్పుడూ స్థానిక యువ‌తీ, యువ‌కుల‌కు ఆమె చెప్పేవారు.

అనుకోకుండా ఓ రోజు ఆస్కా సీటు నుంచి పోటీ చేయాలంటూ ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ నుంచి పిలుపు వ‌చ్చింది. భువ‌నేశ్వర్ వ‌చ్చి బీఫాం తీసుకోవాల‌ని క‌బురు రావ‌డంతో, మొద‌ట వెళ్లేందుకు ప‌రిమ‌ళ నిరాక‌రించారు. ఎందుకంటే, క‌నీసం కారులో భువ‌నేశ్వ‌ర్ వెళ్లాల‌నీ, అయితే అందుకు త‌గినంత డ‌బ్బులు లేక‌పోవ‌డంతో, టిక్కెట్ వ‌ద్ద‌ని చెప్పారు. అయితే విష‌యం తెల్సుకున్న న‌వీన్ ప‌ట్నాయ‌క్, ఆమె ఇంటికి కారు పంపి, భువ‌నేశ్వ‌ర్ ర‌ప్పించుకుని, బీఫాం ఇచ్చి పోటీలో నిల‌బెట్టారు. 

ప్ర‌చారంలో భాగంగా నవీన్ ప‌ట్నాయ‌క్ ప‌థ‌కాల‌ను పాట‌ల రూపంలో జ‌నానికి చెప్పిన ప‌రిమ‌ళ బిష్ణోయ్, బీజేపీ నేత అనిత సుభ‌ద్రాన్షి మీద దాదాపు 2 ల‌క్ష‌ల ఓట్ల‌తో గెలిచార‌ట‌. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిశ్ర‌మ‌లు తెప్పించి, యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే త‌న ల‌క్ష్యం అంటూ చెబుతున్నారు. 

ఇక సౌజ‌త్య పేరుతో ఎన్జీఓ ఆర్గ‌నైజేష‌న్ న‌డుపుతూ, అనాథ పిల్ల‌ల‌కు ఆశ్ర‌యం క‌ల్పిస్తున్న న‌టి నుర్ష‌త్ జ‌హాన్, ప‌శ్చిమ బెంగాల్లోని బ‌సిరాత్ ఎంపీ సీటు నుంచి తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా గెలిచారు. బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దులో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడూ మ‌త‌ప‌ర‌మైన ఉద్రిక్త‌త‌లు నెల‌కొంటాయి. సెక్యుల‌రిజం పెర‌గాల‌నీ చెబుతున్న నుర్ష‌త్, బీజేపీ నేత సేత‌న్ బోస్ మీద 3 ల‌క్ష‌ల 50 వేల ఓట్ల‌తో గెలిచారు. ప్ర‌చారంలో బెంగాల్ న‌టుడు మిమి చ‌క్ర‌వ‌ర్తితో సంబంధం ఉందంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగినా, బెద‌ర‌ని ఆమె, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో శాంతి కోసం ప‌నిచేస్తాన‌ని చెబుతున్నారు. 

ఇక ఖాప్ పంచాయ‌తీ బ‌లంగా ఉన్న హ‌ర్యానాలోని సిర్సా ఎంపీ సీటు నుంచి భారీ మెజార్టీతో గెలిచారు సునీత దుగ్గ‌ల్. ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీసెస్ అధికారి అయిన సునీత‌, భ‌ర్త ఐపీఎస్ అధికారి. ఆమె కుటుంబం మొత్తం చాలా మంది ఉన్న‌త ఉద్యోగులు, రాజ‌కీయ నేత‌లు. 2014లోనే రాజ‌కీయాల్లోకి రావాల‌ని భావించిన ఆమె, అప్ప‌ట్లో టిక్కెట్ ద‌క్క‌లేదు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సునీత దుగ్గ‌ల్, డ్ర‌గ్స్ బారి నుంచి యువ‌త‌ను కాపాడ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మంటున్నారు.

ఈ మహిళా ఎంపీలు సమ్ థింగ్ స్పెషల్ -1

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle