ఈ మహిళా ఎంపీలు సమ్ థింగ్ స్పెషల్ -1
06-06-201906-06-2019 07:24:13 IST
Updated On 06-06-2019 15:00:14 ISTUpdated On 06-06-20192019-06-06T01:54:13.696Z06-06-2019 2019-06-06T01:54:10.506Z - 2019-06-06T09:30:14.455Z - 06-06-2019

మొన్నటి పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ మహిళా ఎంపీలకు చాలా ప్రత్యేకత ఉంది. ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చి వీరు, ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. కేరళలోని అలాథూర్ ఎంపీ సీటు నుంచి గెలిచిన రమ్య హరిదాస్ గురించి తెల్సుకుంటే, ఓ సామాన్య దళిత మహిళ, రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎలా ఎదిగిందో అర్థం అవుతుంది. రమ్య హరిదాస్ తండ్రి దినసరి కూలీ, తల్లి మహిళా కాంగ్రెస్ మండల స్థాయి నేత. ప్రజా సమస్యల మీద జానపద పాటలతో జనంలోకి వెళ్లిన రమ్య, జనానికి బాగా దగ్గర అయ్యారట. పంచాయతీ మెంబర్ ఎన్నిక సమయంలో ఆమెను జనం ఏకగ్రీవంగా గెలిపించారు. 48 ఏళ్ల వయస్సులో పలు ప్రజా ఉద్యమాల్లో పాల్గొని, పార్టీని సంస్థాగతంగా బలంగా తీర్చిదిద్దుతున్న సంగతి 2011లో రాహుల్ గాంధీ తెల్సింది. జనం చిన్నక్క అని పిల్చుకునే రమ్య హరిదాస్, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఏమాత్రం అనుకోలేదు. అయితే ఊహించని రీతిలో నేరుగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. మొదట భయపడిన రమ్య, ఆ తర్వాత ఎన్నికల బరిలో దిగారు. వరుసగా అలాథూర్ ఎంపీ సీటు నుంచి గెలిచిన కమ్యూనిస్ట్ నేత పీ.కే. బిజును మీద లక్ష 58 వేల ఓట్లతో గెలిచారు రమ్య హరిదాస్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేరళ నుంచి పోటీ చేసిన మహిళల్లో గెలిచింది ఈమె ఒక్కరే. సోషల్ మీడియా ద్వారా పది లక్షల మందిని పరిచయం చేసుకున్న రమ్య హరిదాస్, రెండు లక్షల మందికి నేరుగా తనకు ఓటేయాలని కోరుతూ ఎస్ఎంఎస్ పెట్టారు. తన ఆస్తుల విలువ 22,816 రూపాయలుగా ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించింది రమ్య హరిదాస్. ప్రతి బహిరంగ సభలో పాటలు పాడుతూ జనాన్ని ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు పార్లమెంట్ వేదికగా తన గళం వినిపించనుంది. రైతు సమస్యలే తన ప్రధాన ఎజెండాగా చెబుతున్న రమ్య హరిదాస్, రాజకీయాల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుతోంది. (ఇంకా ఉంది) ఈ మహిళా ఎంపీలు సమ్ థింగ్ స్పెషల్ -2

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
21 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా